Animal: 4వ రోజు కూడా దంచికొట్టిన యానిమల్.. ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్గా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే . ఇక ఈ సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కు అటు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో కూడా విడుదల చేసి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన చిత్రం యానిమల్..

డిసెంబర్ ఒకటో తేదీన పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద 116 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా వీకెండ్స్ లో రూ.350 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. ఇకపోతే నాలుగవ రోజు ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధించింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.. తాజాగా

అందుతున్న లెక్కలు ప్రకారం సోమవారం కలెక్షన్లతో కలిపి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.425 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేస్తుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా విడుదల చేసింది. చూస్తూ ఉంటే ఈ సినిమా మంగళవారం రోజు రూ.500 కోట్ల టార్గెట్ ను మరింత సులభంగా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

త్వరలోనే వెయ్యి కోట్లు అందుకోవడానికి మరింత సమయం పట్టణవసరం లేదు అని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. అంతేకాదు అతడి మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. పెట్టుబడి పెట్టిన నిర్మాత దిల్ రాజు రెండు రోజుల్లోనే తన డబ్బును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రస్తుతం రూ .5కోట్ల ప్రాఫిట్ తో కొనసాగుతుందని సమాచారం
అటు డైరెక్టర్గా సందీప్ ఇటు హీరోగా రణబీర్ ఇద్దరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు