Balakrishna : బాలయ్యతో అనిల్.. ‘బ్రో ఐ డోంట్ కేర్’..?

నందమూరి బాలకృష్ణ క్రేజ్ ను ఎలా వాడుకోవచ్చో, ఎలా క్యాష్ చేసుకోవచ్చో బోయపాటి శ్రీన్ కు బాగా తెలుసు. ఆయనే అందరి దర్శకులకు కూడా నెర్పించారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని కూడా బోయపాటి స్టైల్ నే ఫాలో అవుతూ బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఏంటన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. అయితే ఇది పూర్తి బోయపాటి స్టైల్లో సాగే మాస్ సినిమా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన ఓ మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని అనిలే చెప్పాడు. అతని కూతురిగా శ్రీ లీల కనిపించబోతుంది అని కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే ఈ చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ టైటిలే.. ‘బ్రో ఐ డోంట్ కేర్’. ఓ పక్క బాలయ్య యాటిట్యూడ్ ను తెలియజేస్తూనే మరోపక్క మాస్ అప్పీల్ కూడా కలిగి ఉంది ఈ టైటిల్. ఇక ఈ మూవీ కంప్లీట్ గా యాక్షన్ బేస్డ్ మూవీ అని తెలుస్తుంది. బాలయ్య స్టైల్లో యాక్షన్ ఉంటూనే, ఎంటర్టైన్మెంట్ ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉంటుందట. ఇలా మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న డైరెక్టర్స్ బాలయ్యతో సినిమాలు చేసి హిట్స్ తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు