Anasuya: అనసూయ నోట జబర్దస్త్ మాట.. గాలి మళ్ళిందా..?

Anasuya:  బుల్లితెర గ్లామర్ క్వీన్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా యాంకర్ గా పనిచేసి ఇటీవలే షో నుంచి బయటకు వచ్చి వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. యాంకర్ అనే ట్యాగ్ వదిలించుకోవాలని గట్టి ప్రయత్నమే చేస్తుంది కానీ ఆ ట్యాగ్ మాత్రం ఈమె నుంచి వీడి వెళ్లడం లేదని చెప్పాలి. ఎన్నో సినిమాలలో మరెన్నో పాత్రలు చేసినా సరే.. సరైన గుర్తింపు లభించడం లేదు.. ఇదిలా ఉండగా యాంకరింగ్ చేసేదే లేదు అంటూ కుండబద్దలు కొట్టిన ఈమె అందుకు కారణాలు కూడా తెలిపింది.

టిఆర్పి రేటింగ్ కోసం మేకర్స్ వేస్తున్న పిచ్చి స్టంట్స్ తనకు నచ్చడం లేదని.. అవి ఎప్పటికీ కొనసాగేవే కాబట్టి ఇకపై తాను చేయను అంటూ తెలిపింది. అలా 2022లో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఇతర కమిట్మెంట్ కారణంగా జబర్దస్త్ కి టైం ఇవ్వలేకపోతున్నానని చెప్పింది కానీ అసలు నిజం వేరు.. యాంకర్స్ ని కూడా స్కిట్స్ లో ఇన్వాల్వ్ చేయడం ఎక్కువైపోయింది.. ముఖ్యంగా స్టార్ కమెడియన్ హైపర్ ఆది లాంటి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు సెటైర్లు వేస్తున్నారు. కోపం వచ్చినా బయటపడలేని పరిస్థితి.. మరొకవైపు తనపై జబర్దస్త్ కమెడియన్లు బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఓపెన్గానే చెప్పింది. ఇక అలా వాటన్నింటినీ భరించలేక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ .అప్పటికే చాలా మంది స్టార్స్ వెళ్లిపోయినా.. ఇక ఈమె కూడా వెళ్లిపోవడంతో షో టిఆర్పి రేటింగ్ కూడా తగ్గిందని చెప్పవచ్చు.

ఆమె వెళ్లిపోయిన తర్వాత సౌమ్యరావు ఇప్పుడు సిరి హనుమంతు ఇలా ఎంతమంది వచ్చినా సరే ఆమె స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. అయితే ఇటీవల జబర్దస్త్ గురించి మళ్లీ తన జ్ఞాపకాలను పంచుకుంది
ఇది చూసిన నెటిజన్స్ ఏంటి జబర్దస్త్ వైపు గాలి మళ్ళిందా? ఆ రోజేమో ఆరోపణలు చేసి ఇప్పుడు జబర్దస్త్ గురించి మాట్లాడుతున్నావ్ ఏంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఈమె తన మాటలను బట్టి చూస్తే జబర్దస్త్ లోకి మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉందేమో అన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఈసారి పక్కా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . మరి ఈ సినిమా అనసూయకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు