Vikram : బాహుబలి 2 రికార్డ్ బ్రేక్

కమల్ హాసన్ హీరోగా ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం విక్రమ్. జూన్ 3 న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రం మరో అసాధారణమైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, తమిళంలో బాహుబలి 2 అత్యధికంగా రూ.152 కోట్ల కలెక్షన్లను రాబట్టిన మూవీగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డును విక్రమ్ సినిమా చెరిపేసింది. అంతేకాదు తమిళ వెర్షన్ పరంగా ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు ఫహాద్ ఫాజిల్ తో పాటు విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించగా రోలెక్స్ అనే పాత్రలో సూర్య కనిపించిన సంగతి తెలిసిందే. అనిరుధ్ అందించిన సంగీతం కూడా ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు