Rashmika Mandanna : నేషనల్ క్రష్, టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు గతంలో నటించిన సినిమాలు వేరు, పుష్ప తర్వాత ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లింది. నేషనల్ వైడ్ సక్సెస్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు ఎవర్ గ్రీన్ స్మైల్ తో హెల్దీగా గడుపుతుంది. ఇక ఈ అమ్మడు హ్యాపీ లైఫ్ కోసం తనదైన స్టైల్ లో వివరించిన కొన్ని చిట్కాలు ఏంటో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం..
రష్మిక ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. నవ్వు మనిషిని ఆనందంగా ఉంచుతుందని ఆమె నమ్ముతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారని ఆమె నమ్ముతుంది. స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని.. అయితే ఎప్పుడో ఒకసారి స్వీట్ తప్పక తినొచ్చు.. అవి రిఫైన్డ్ షుగర్‌తో చేయకపోతే మంచిది అంటూ వివరించింది. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటును కొందరు అనారోగ్యం అనుకుంటారు.. కానీ కొంచెం తాగితే రోజంతా ఫ్రెష్ గా ఉండొచ్చునని ఆమె అంటుంది. అలాగే మనిషి సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు ఒక ప్లేస్ లో కాకుండా వేరే ప్లేసులకు వెళ్తు ఉండాలి.. అంటే ట్రావెలింగ్ చెయ్యడం కూడా ఇంపార్టెంట్ అని చెబుతుంది.
ఇక పోతే పుస్తకాలు చదవడం మంచి అలవాటు. ఒక్క మంచి పుస్తకం చదవడం ప్రారంభిస్తే నాకైతే అది పూర్తయ్యే వరకు టైమే తెలియదు అంటూ వివరించింది. ఇక రోజు ఎంత బిజీగా ఉన్నా.. స్ట్రెస్ తగ్గాలంటే కచ్చితంగా నిద్ర కావాలి. శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే ఏ పనైనా ఎలా చేస్తాం.. అలాగే నచ్చిన పని చేస్తే అందులో ఆ తృప్తి వేరేలా ఉంటుంది. నచ్చని పని చేస్తూ ఇబ్బంది పడితే ఆనందం ఉండదు అని రష్మిక చెబుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడుకు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం అర డజను సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె ఛావా ( chaava), పుష్ప 2 ( pushpa 2) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది..