Mathu Vadalara 2 : దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి నటించిన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ మత్తు వదలరా 2. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఏ ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే విషయం బయటకు వచ్చింది. మరి మత్తు వదలరా 2 మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
మత్తు వదలరా ఏ ఓటీటీలో రాబోతోందంటే ?
శ్రీ సింహ కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ మత్తు వదలరా2. భారీ అంచనాళాతో తాజాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీకి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ రివ్యూలు వస్తున్నాయి. కడుపుబ్బా నవ్వుకునే కథతో తెరకెక్కిన మత్తు వదలరా 2 ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనేది తెలియయాలంటే కంప్లీట్ రివ్యూ వచ్చేదాకా ఆగాల్సిందే. అయితే అంతలోపే ఈ మూవీ ఏ ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది అని వెతకడం మొదలుపెట్టారు మూవీ లవర్స్. ఇక ఆ విషయంలోకి వెళ్తే తాజాగా మత్తు వదలరా 2 డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడయ్యాయి.
నిజానికి ఈ మూవీ రైట్స్ కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీ పడగా, దిగ్గజ ఓటీపీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. మత్తు వదలరా 2 ఓటిటి పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ అంటూ చిత్ర బృందం టైటిల్స్ లో రివిల్ చేసింది. అయితే ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ గురించి తాజాగా ఓ వార్త షికారు చేస్తోంది. దాని ప్రకారం మత్తు వదలరా 2 మూవీని థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్నారని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే ఆ లెక్క ప్రకారం సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన మత్తు వదలరా 2 మూవీ అక్టోబర్ మూడో వారంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
సీక్వెల్ హిట్టా ఫట్టా ?
శ్రీ సింహ హీరోగా తెరకెక్కిన మత్తు వదలరా 2 మూవీ అంతకంటే ముందు వచ్చిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్. ఈ సినిమాను క్లాత్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై హేమలత పెద్దమల్లు, చిరంజీవి పెద్దమల్లు నిర్మించారు. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, సత్య, సునీల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతాన్ని అందించారు. ఇక మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ విషయానికి వస్తే… ఈ మూవీతోనే శ్రీ సింహ కోడూరి హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఫస్ట్ పార్ట్ కి టాక్ బాగానే ఉన్నప్పటికీ హిట్ మాత్రం కాలేదు. ఆ తర్వాత శ్రీ సింహ చేసిన పలు సినిమాలు కూడా ఇలాగే చతికిలబడ్డాయి. అందుకే మత్తు వదలరా 2తో ఎలాగైనా హిట్ అందుకోవాలని కసితో శ్రీ సింహా ఉన్నాడు. మరి ఈ మూవీ తోనైనా ఆయన హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.