OTT Thriller Movie: ప్రతి వారం సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇటీవల వస్తున్న సినిమాలు సస్పెన్స్ కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. థియేటర్లలో ఆకట్టుకొని కొన్ని చిత్రాలు ఓటీటీ లోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. హారర్, కామెడీ, థ్రిల్లర్ సినిమాలు బాగా ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఇప్పుడు అలాంటిదే ఓ తమిళ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు టీన్స్ కాగా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు టీన్స్ (Teenz ).. ఇది థియేటర్ల లో పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో కి వచ్చేసింది. ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక్కసారి చూసేద్దాం..
ఈ తమిళ మూవీ పేరు టీన్స్ (Teenz).. జులై 12 న తమిళం లో థియేటర్లలో రిలీజైంది. అయితే సరిగ్గా రెండు నెలల తర్వాత అంటే గురువారం (సెప్టెంబర్ 12) నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video ) లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్టోరీని చెబుతూ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. 13 మంది టీనేజర్లు తమ క్లాస్ కు బంక్ కొట్టి బయటకు వెళ్లాలని అనుకుంటారు. కానీ ఆ నిర్ణయమే వాళ్ల ఎప్పుడూ ఊహించనంత ప్రమాదంలోకి వాళ్లను నెట్టేస్తుంది. వాళ్లు ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు అన్నది కథ.. స్కూల్ పిల్లలు ఎదుర్కొన్న సవాళ్లు ఈ మూవీలో చూపించారు..
ఈ సినిమాను రాధాకృష్ణన్ పార్థీబన్ (Radhakrishnan Prthivan ) డైరెక్ట్ చేశాడు. 8 మంది టీనేజీ అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. అందులో నక్షత్ర అనే అమ్మాయి నాన్నమ్మ వాళ్ల ఊరు కనగవల్లికి వెళ్లాలని వాళ్లు అనుకుంటారు.. అక్కడకు వెళ్లిన పిల్లలు ఆ ఊరిలో ఒక 500 ఏళ్ల క్రితం కల బావిని చూడాలని అందులో నిజంగా దెయ్యాలు ఉన్నాయా అనేది తెలుసుకోవాలని అనుకోని వెళ్లి చిక్కుల్లో పడతారు. తాము చాలా ధైర్య వంతులమని నిరూపించుకోవాలని భావిస్తారు. అందుకే స్కూల్ ఎగ్గొట్టి ఆ ఊరికి వెళ్తారు. అయితే ఆ క్రమంలో వాళ్లలో ఒక్కొక్కరుగా కొందరు మిస్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు ఇంకెలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరికి వారంతా క్షేమంగా చేరుకున్నారా? అన్నది సినిమా కథ.. అక్కడ బాగానే ఆకట్టుకున్న ఈ మూవీ ఇక్కడ ఎలా మెప్పిస్తుందో చూడాలి.. మీరు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇలాంటి సస్పెన్స్ మూవీలను ఎక్కువగా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక్కడకు వచ్చిన ప్రతి సినిమా మంచి సక్సెస్ టాక్ ను అందుకున్నాయి.