Pawan Kalyan : ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్ నామ స్మరణే నడుస్తోంది. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యి చాలా కాలమే అవుతున్నప్పటికీ ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు సరికదా డబుల్ అవ్వడం విశేషం. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారారు. ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని 21 సీట్లు గెలుచుకుంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమితులైన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. మరి ఆయన ఆస్తులు, పవర్ స్టార్ దగ్గరున్న కార్ల కలెక్షన్ పై ఓ లుక్కేద్దాం పదండి.
వందల కోట్లకు వారసుడు
మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. పలు అద్భుతమైన సినిమాలు చేసి ఇండస్ట్రిలో మరే ఇతర హీరోకూ లేని విధంగా కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు. ఇక ఆయన ఆస్తుల విషయానికొస్తే సెపరేట్ గా వందల కోట్లను సంపాదించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సమయంలో పవన్ కల్యాణ్ తన ఆస్తుల వివరాలను కూడా విడుదల చేశారు. ఇందులో తన వద్ద రూ.46.17 కోట్ల చరాస్తులు, రూ.118.36 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తన నికర విలువ 164 కోట్లు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఖరీదైన ఇళ్లు కూడా ఉన్నాయి. విజయవాడలో ఉన్న ఆయన ఇంటి ధర రూ. 16 కోట్లు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉన్న ఇంటి విలువ రూ.12 కోట్లు, బంజారాహిల్స్‌లోని ఫ్లాట్ ధర రూ.1.75 కోట్లు. గత నాలుగేళ్లలో ఆయన సంపద రూ.60 కోట్లు పెరిగింది.
పవన్ కార్ల కలెక్షన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తుతం 11 లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.14 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పవన్ గ్యారేజీలో ఉన్న ఆ 11 కార్ల లిస్ట్ లో రేంజ్ రోవర్, జాగ్వార్, ఆడి వంటి ఖరడైన కార్లతో పాటు హార్లీ డేవిడ్‌సన్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల బైక్‌లు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. కాగా ప్రస్తుతం పవన్ బ్యాంక్ బ్యాలన్స్ 20 కోట్లు అని సమాచారం. ఆయన ఒక్కో నెలకు 1.5 కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఏడాదికి అల్మోస్ట్ 18 కోట్లు అన్నమాట. ఇక ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే పారితోషికం కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ ఓజీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు ఎన్నికలు, ఆ తర్వాత ఉపముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టడంతో బ్రేక్ పడింది. అయితే త్వరలోనే పవన్ మళ్లీ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.