Mythri Movie Makers: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు(Sreemanthudu) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలుగా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది ఈ సంస్థ. అతి తక్కువ కాలంలోనే మంచి క్వాలిటీ సినిమాలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. చాలామంది స్టార్ హీరోలతో ఈ ప్రొడక్షన్ హౌస్ సినిమాలను నిర్మించింది. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ మినహాయిస్తే మిగతా స్టార్ హీరోలు అంతా కూడా ఈ బ్యానర్ లో సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ బ్యానర్ లో ఉస్తాద్ భగత్ సింగ్(Usthaadh Bagath Singh) అనే సినిమాను చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్న టాప్ మూవీస్ లో పుష్ప 2(Pushpa 2) ఒకటి. ఈ బ్యానర్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పుష్ప(Pushpa). నార్త్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇటై మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. దర్శకుడు సుకుమార్ కు, హీరో అల్లుఅర్జున్ కు మంచి గుర్తింపుని తీసుకొచ్చిన పుష్ప. ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది. ఇకపోతే ఈ బ్యానర్లు భారీ సినిమాలతో పాటు చిన్న కాన్సెప్ట్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. చిన్న సినిమాకు వచ్చిన మత్తు వదలరా సినిమా పెద్ద హిట్ సాధించింది.
రీసెంట్ గా ఈ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసింది. వీళ్ళ బ్యానర్ లో తెరకెక్కే సినిమాలు మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో మంచి బజ్ ఉన్న సినిమాలను కూడా ఈ బ్యానర్ రిలీజ్ చేస్తూ వస్తుంది. ఈ బ్యానర్ నుంచి మత్తు వదలరా 2 సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇ టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్గా ప్రభాస్ చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ రిలీజ్ వీడియో కూడా చాలా ఫన్నీగా డిజైన్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు అని చెప్పాలి.
డిఫరెంట్ అగ్రిమెంట్
ఇకపోతే ఈ ట్రైలర్ ప్రభాస్ రిలీజ్ చేయడానికి కారణం, ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగిన బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. ఈ సినిమా అగ్రిమెంట్ లో భాగంగానే మత్తు వదలరా 2 ట్రైలర్ ను రిలీజ్ చేసి, ప్రభాస్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మా బ్యానర్లో సినిమాలు చేయడమే కాదు మా బ్యానర్ లో జరిగే సినిమాలను ప్రమోట్ కూడా చేయాలి అంటూ మైత్రి మూవీ మేకర్స్ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రభాస్ హను సినిమాకి సంబంధించిన లొకేషన్స్ వెతికే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ తరసన ఇమాన్వి కనిపించబోతుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమా తర్వాత హను దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి మంచి అంచనాలు మొదలయ్యాయి. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ త్వరలో రానున్నాయి.