Devara First Review : మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Ntr ) నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర ( Devara ) .. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందు రాబోతుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వంలో రాబోతున్న హైవోల్టేజ్ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ పోషించారు. దేవర మూవీ సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. ఫ్యాన్స్ కు కిక్ ఎక్కించే న్యూస్ అనే చెప్పాలి.. సెన్సార్ రివ్యూ ప్రకారం సినిమా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
ఈ మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌కు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ యాక్షన్, డైలాగ్స్ అదిరిపోయాయి. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో వచ్చే విజువల్స్ ఆకట్టుకున్నాయి. షార్క్‌ను పట్టుకొని సముద్రంలో నుంచి ఎన్టీఆర్ పైకి ఎగిరే షాట్ ప్రత్యేకంగా ఆకర్షించింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాకు బ్యాక్ బోన్ మ్యూజిక్ అనే చెప్పాలి. ప్రతి సీన్ ప్రేక్షకులకు ఉత్కంటను కలిగిస్తున్నాయి. సినిమా కథ కొన్ని సినిమాలను లింక్ చేసినా కూడా కొత్తగా చూపించడం మాత్రమే కాదు.. కొరటాల అద్భుతమైన విజువల్స్ ను అందించారనే టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక సెన్సార్ రివ్యూ విషయానికొస్తే.. దేవర సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ మూవీ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల (సుమారు 178 నిమిషాలు) రన్ టైమ్‍తో రానుంది. అంటే దాదాపు మూడు గంటల నిడివి ఉండనుంది. ఈ మూవిలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్లే రన్ టైం బాగా పెరిగిందనే టాక్ ను సొంతం చేసుకుంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతోనే టైం పెరిగిందని తెలుస్తుంది. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ నుం చూస్తేనే తెలుస్తుంది ..
ఇకపోతే దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ( Janvi Kapoor ) హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంతోనే తెలుగులో అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో నటించాక తాను ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యానని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో జాన్వీ చెప్పారు. దేవరలో విలన్ పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్స్ భారీ బడ్జెట్‍తో రూపోందిస్తున్నారు. ఇప్పటివరకు అయితే పాజిటివి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..