Devara Trailer : నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), త్రిపుల్ ఆర్ (RRR) తర్వాత గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. మూడు పాటలను రిలీజ్ చెయ్యగా వాటికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను నేడు ముంబైలో గ్రాండ్‌గా విడుదల చేశారు.. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. విడుదలై కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్స్ లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
ఈ ట్రైలర్ లో కులం లేదు, మతం లేదు, భయం లేదు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవరను పరిచయం చేస్తారు. ఆ తర్వాత మనిషికి బ్రతికేంత దైర్యం చాలు, చంపెంత ధైర్యం కాదు అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైఫ్ అలీఖాన్ డైలాగులు కూడా ట్రైలర్ కు మంచి హైఫ్ ను క్రియేట్ చేస్తున్నాయి. మొత్తం నరుకుడే ఉంది. యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయి. అనుకున్న విధంగానే అనిరుధ్ మ్యూజిక్ ఓ రేంజులో ఉంది. ఇక జాన్వీ కపూర్ అందాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.
మాస్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ లుక్, ఫైటింగ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సముద్రపు అలలు ఎరుపు రంగుతో ఉండటం చూస్తుంటే నరకడం మొదలు పెడితే ఆగదు అని అర్థమవుతుంది. జాన్వీ కపూర్ (Janvi Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan ) లు కు తమ నటనతో ఆకట్టుకునేలా ఉన్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కే థియేటర్లు దద్దరిల్లేలా ఉన్నాయి. ట్రైలర్ లోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకొనే ఉంది. మొత్తానికి ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. కొరటాల కం బ్యాక్ ఇచ్చేలా ట్రైలర్ ఉంది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.. ఏది ఏమైనా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉండటంతో తమ హీరోను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు మంచి హైప్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా దేవర సినిమాను పాన్ ఇండియా రేంజిలో హిట్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఆ విషయంలో ట్రైలర్ ద్వారా ఓ క్లారిటీ వచ్చేసినట్లు ఉంది . ఇక ట్రైలర్ కిక్ ఇస్తే సినిమాకి భారీ ఓపెనింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అన్నీ కుదిరితే తొలిరోజునే దేవర 150 కోట్ల గ్రాస్‌ని టచ్ చేసే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో సినిమా 1000 కోట్ల వరకు చేరుకోవడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..