Saripodhaa Sanivaaram Collections : నేచురల్ స్టార్ నాని నటించిన “సరిపోదా శనివారం” సినిమా విడుదల రోజు నుండే అదిరిపోయే వసూళ్ళతో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాని – వివేక్ ఆత్రేయ (vivek atreya) కాంబోలో అంటే సుందరానికి సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, టీజర్, ట్రైలర్స్ తో అంచనాలను పీక్స్ కి పెంచేసింది. ఇక విడుదలైన రోజు ఓపెనింగ్స్ విషయంలో కాస్త తడబడేసరికి రిజల్ట్ పై కొందరు అనుమానం వ్యక్తం చేసినా, రెండో రోజు నుండే స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ, అదిరిపోయే కలెక్షన్లు వెనకేసుకుంటుంది. అయితే ఇతర భాషల్లో అంతగా ప్రభావం చూపకపోయినా, తెలుగు వెర్షన్ మాత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఐదు రోజుల్లో కెరీర్ బెస్ట్ కొట్టేసిన నాని..
ఇక నాని సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా అన్నిటికంటే ఎక్కువగా ఓవర్సీస్ లో జోరు చూపిస్తుంది. ఎంతలా అంటే నాని ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయితే వచ్చే కలెక్షన్ల రేంజ్ లో ఈ సినిమా ఆడుతుంది. ఓవర్సీస్ లో నానికి (Nani) ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవర్సీస్ లో అత్యధిక మిలియన్ డాలర్లు ఉన్న హీరోల్లో మహేష్ బాబు తర్వాత నాని రెండో స్థానంలో ఉన్నాడు. తొందర్లో మహేష్ ని కూడా బీట్ చేసేస్తాడనడంలో సందేహం లేదని చెప్పాలి. ఇక తాజాగా సరిపోదా శనివారం సినిమాతో అదిరిపోయే రికార్డ్ ని ఓవర్సీస్ లో సొంతం చేసుకున్నాడు. ప్రీమియర్స్ నుండే భారీ ఓపెనింగ్స్ తో రచ్చ చేసిన ఈ సినిమా తాజాగా ఐదు రోజుల్లోనే 2.05 మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది.
ఇక్కడ భారీ ప్రాఫిట్ దిశగా సరిపోదా శనివారం..
ఇక నాని కెరీర్ లో ఓవర్సీస్ లో హైయెస్ట్ గ్రాసర్ గా ఇంతకు ముందు దసరా 2.04 M తో మొదటిస్థానంలో ఉండగా, ఇప్పుడు సరిపోదా శనివారం ఐదు రోజుల్లోనే దసరా (Dasara) ను బ్రేక్ చేసేసి, నాని కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా సరిపోదా శనివారం నిలిచింది. ఫుల్ రన్ లో ఇక్కడ 2.5 మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే 70 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది. అలాగే కర్ణాటక లో కూడా సరిపోదా శనివారం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోగా, నైజాంలో కూడా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది. మరి తొలివారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.