Nani Vs Niveda Thomas: నాని(Nani) హీరోగా వివేకాత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో చేసిన సినిమా సరిపోదా శనివారం. ఆగస్టు 29 ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ ఈ సినిమాకి దాదాపు 110 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు సమాచారం వినిపిస్తుంది. నాని జెర్సీ సినిమా తర్వాత తను ఎంచుకునే ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా వర్క్ అవుతుంది కానీ కమర్షియల్ గా అనుకున్న సక్సెస్ను సాధించలేక పోతుంది. నాని సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రమే చెప్పాలి.
నాని చేసిన జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ , దసరా వంటి సినిమాలు అద్భుతమైన టాక్ ను సాధించుకున్నాయి కానీ టాక్ ను మ్యాచ్ అయ్యేటట్టు కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇక అప్పటి ప్రభుత్వంపై నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. దానివల్ల నాని సినిమా హిట్ అయినా కూడా టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వలన మంచి కలెక్షన్స్ వచ్చేవి కాదు. ఇక నాని వివేకాత్రేయ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అంటే సుందరానికి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. అందుకనే నెక్స్ట్ సినిమా కమర్షియల్ గా ఉండాలని ప్లాన్ చేసి సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ, ఈ సినిమా కలెక్షన్స్ తో బయ్యర్స్ ఇంకా పూర్తి సంతృప్తిగా లేరు అని తెలుస్తుంది.
నాని కంటే నివేదా థామస్ గొప్ప
సరిపోదా శనివారం సినిమా తర్వాత వారం రోజులు గ్యాప్ లో నివేద థామస్ నటించిన 35 ఇది చిన్న కథ కాదు సినిమా రిలీజ్ అయింది. రానా నిర్మించిన ఈ సినిమాకు దాదాపు 6 కోట్ల వరకు ఖర్చయింది. అయితే సరైన కాంపిటేషన్ లేకపోవడం వలన, అలన ఈ సినిమా కాన్సెప్ట్ కూడా బాగుండటం వలన ఈ సినిమాకి మంచి టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా మంచి లాభాలతో దూసుకుపోతుంది. నాని సినిమాతో పోలిస్తే నివేద థామస్ సినిమా బెటర్ అని చెప్పాలి. అలానే ఈ సినిమా ఓటిటి వెర్షన్ కూడా త్వరలో రిలీజ్ కానుంది.
ఇకపోతే ఈ సినిమా ఈవెంట్ కు నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. హాజరవ్వడమే కాకుండా సరిపోదా శనివారం లాంటి సినిమా చూడకపోయినా పర్వాలేదు, కానీ 35 లాంటి సినిమా ఖచ్చితంగా చూడాలి అని నాని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ అయిందని చెప్పాలి. ఇది ఎంతలా ప్లస్ అయింది అంటే నాని సినిమా కంటే కూడా నివేద సినిమా బెటర్ అనిపించేంతలా వర్కౌట్ అయింది.