Bigg Boss 8 Telugu : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ షో 8 వ సీజన్ కాస్త కొత్తగా ఉందని తెలుస్తుంది. మొన్నటివరకు టైం పాస్ చేస్తున్నారు అనుకున్న హౌస్ మెట్స్ రెండో వారం విజ్రంబిస్తున్నారు. ప్రతి టాస్క్ లో పోటి పడి ఆడుతున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న టాస్క్ లు కేవలం తమ ఫుడ్ ను సంపాదించుకోవడానికే అన్నట్లు ఉన్నాయి.. ఫుడ్ కోసమే టాస్క్ లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ వారం ఎపిసోడ్స్ అన్నీ ఆకట్టుకుంటున్నా హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో అన్నది ఆసక్తిగా మారింది. అయితే బిగ్ బాస్ జనాల ఊహకు అందని విధంగా ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఎలిమినేషన్ కూడా ట్విస్ట్ లతో జరుగుతుందని ఆడియన్స్ ఊహిస్తున్నారు. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో ఒకసారి చూసేద్దాం..
మొదటి వారం బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఇక రెండవ వారం కూడా త్వరలో పూర్తి కాబోతోంది. ఇవాళ అంటే శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవబోతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ ఎవరు అని.. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ మొదలైంది. ఎలిమినేషన్ కంటే ముందు అసలు నామినేటెడ్ కంటెస్టెంట్లు ఎవరో ఒకసారి చూద్దాం. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు శేఖర్ భాష, పృధ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య, నాగ మణికంఠ, నైనిక, సీత, విష్ణు ప్రియ లు ఉన్నారు. వీరంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. మరి వీరిలో ఎవరు బయటకు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది.
ఈ వారం నామినేట్ అయిన వారిలో ఆదిత్య, శేఖర్ బాష అయితే తక్కువ ఓట్లు సాదించడం వల్ల ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. అందరి అంచనాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ట్రెండ్ చూసి.. ఈ వారం ఎలిమినేషన్ కోసం ఎక్కువ ప్రమాదంలో ఉన్నవారు.. శేఖర్ బాషా అని చెప్పవచ్చు. సీత కి కూడా ఓట్స్ తక్కువగానే ఉన్నాయి. సీత, శేఖర్ భాషా ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంది . ఇతను ఆదిత్య తో పోలిస్తే టాస్క్ లలో కూడా ఎక్కువగా పెర్ఫార్మన్స్ చెయ్యలేక పోయాడు. శేఖర్ భాషా జోక్స్ ఇంస్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న సమయంలో.. ఈవారం సీతనే ఆటలోంచి వెళ్లిపోవచ్చు అని అంచనాలు వేస్తున్నారు ఆడియన్స్.. బిగ్ బాస్ షో నిర్వాహకుల నిర్ణయాలతో కలిపి.. ఈ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అంత ఈజీ కాదు. ఈ వారాంతానికి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే..