Bigg Boss 8 Day 14 promo.. బిగ్ బాస్ 8వ సీజన్ (Bigg Boss season 8) ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇన్ఫినిటీ గేమ్ షో అంటూ వచ్చిన ఈ షో ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తోంది అని చెప్పవచ్చు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయడం, ఎప్పుడో బిగ్ బాస్ చివరి వారంలో ఇవ్వాల్సిన సర్ప్రైజ్లను రెండో వారంకే ఇవ్వడం అన్నీ కూడా ఆడియన్స్ కు ఊహించని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.
చీఫ్ గా సరికొత్త కంటెస్టెంట్..
ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 8 రెండవ వారం చివరి దశకు చేరుకుంది. అందులో భాగంగానే నాగార్జున కంటెస్టెంట్స్ తో ఫుల్ కామెడీ చేయిస్తూ ఆకట్టుకున్నారు. ఇకపోతే నిన్నటి వరకు హౌస్ లో నైనిక, యష్మి, నిఖిల్ అంటూ ముగ్గురు చీఫ్స్ ఉండగా.. యష్మీ , నైనిక చీఫ్స్ గా ఫెయిల్ అవ్వడంతో వీరిద్దరి స్థానంలో అభయ్ నవీన్ చీఫ్ గా ఎన్నికయ్యారు. ఇక నిఖిల్ , అభయ్ క్లాన్స్ లోకి ఎవరెవరు వెళ్తున్నారు..? ఎందుకు వెళ్తున్నారో? చెప్పి మరీ డిసైడ్ చేసుకోమని , గ్రూపులుగా డివైడ్ అవ్వాలని తెలిపారు నాగార్జున. అయితే విష్ణు ప్రియ నిఖిల్ టీంలోకి వెళ్తున్నాను అని చెప్పింది. అయితే ఎందుకని నాగార్జున ప్రశ్నించగా.. సిగ్గుతో తలదించుకొని నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అంటూ కామెంట్ చేసింది. ఇక తర్వాత ఒక్కొక్కరు అభయ్ , నిఖిల్ టీం లోకి ఎందుకు చేరుతున్నారో చెప్పి వారి టీంలోకి వెళ్లిపోయారు.
చిత్రం విచిత్రం అంటూ నవ్వులు పూయించిన కంటెస్టెంట్స్..
ఇక తర్వాత 13 మంది కంటెస్టెంట్స్ మధ్య చిత్రం విచిత్రం అనే టాస్క్ నిర్వహించారు నాగార్జున. ఇందులో రెండు బొమ్మలని చూపించి ఆ రెండు బొమ్మలు కలిపితే ఏ పదం వస్తుందో చెప్పాలి అని చెబుతాడు నాగార్జున. దాంట్లో మొదట ఆపిల్, ఎండు మిర్చి ను చూపిస్తాడు నాగార్జున. దీనికి శేఖర్ బాషా మిరపల్ అంటూ సంబంధంలేని పదం చెప్పి నవ్వులు పూయిస్తాడు.ఇక తర్వాత బ్యాటరీ, ల్యాండ్ లైన్ ఫోన్ బొమ్మలను ప్రజెంట్ చేయగా.. సీత సెల్ఫోన్ అంటూ తెలిపింది. అయితే ఎవరో తనకు హెల్ప్ చేస్తున్నారు అంటూ నాగార్జున తెలిపారు. ఎవరు చేయలేదు నేనే తెలిపాను అని సీత చెబితే, కాదు విష్ణు చెప్పింది అని చెబుతాడు. దాంతో విష్ణు ప్రియ చటుక్కున లేచి.. సార్ నాకే అంత తెలివి ఉంటే ఐఏఎస్ అయ్యేదాన్ని అంటూ అందరినీ నవ్వించింది. ఆ తర్వాత ఒక గ్లాసులో మిల్క్, మరొక ఫోటో లో దుబాయ్ షేక్ చూపించగానే.. అది మిల్క్ షేక్ అవుతుంది. కానీ దానిని విష్ణుప్రియ దుబాయ్ షేక్ మీకు నమస్కారం చేస్తున్నాడు అంటూ కామెంట్ చేసి అందరిని నవ్వించింది. ఇలా మొత్తానికైతే విష్ణుప్రియ తన కామెడీతో ప్రోమోకే హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.