శ్రీలీల తీసుకున్నది గుడ్ డెసిషనే.. బ్యాడ్ అగ్లీ కాదు

కొన్ని రోజుల నుంచి యంగ్ హీరోయిన్ శ్రీలీల కొత్త మూవీపై చాలా గాసిప్స్ వస్తున్నాయి.

తమిళ సీనియర్ హీరో అజిత్ కుమార్ కొత్త మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలో   సరసన ఈ యంగ్ బ్యూటీ నటించబోతుందని ఆ గాసిప్స్ మీనింగ్.

ఈ గాసిప్స్ ఎంత వైరల్ అవుతుందో... శ్రీలీలపైన ట్రోల్స్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి.

కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న సమయంలో సీనియర్ హీరోలతో సినిమాలు ఏంటి అంటూ నెటిజన్లు శ్రీలీలపై కామెంట్స్ చేస్తున్నారు.

అయితే కోలీవుడ్ నుంచి వస్తున్న టాక్ ఏంటంటే...? అజిత్ మూవీలో శ్రీలీల పాత్ర హీరోతో రొమాన్స్ చేసేలా ఉండదట.

భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల చేసిన పాత్రలాగే ఈ బ్యాడ్ గుడ్ అగ్లీలో ఉంటుందని టాక్.

నిజానికి అజిత్  యంగ్ హీరోయిన్‌లను తన సినిమాలో తీసుకోడు.

అంత ఎందుకు... రొమాన్స్ ఛాన్స్ ఉండే స్టోరీలకు కూడా దూరంగా ఉండి, తన వయసుకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాడు.

ఇప్పుడు బ్యాడ్ గుడ్ అగ్లీలో కూడా అజిత్ పాత్ర అలాగే ఉంటుందట. అందుకు అనుకూలంగా శ్రీలీల పాత్ర గ్లామర్ టచ్ లేకుంట ఉంటుందని సమాచారం.

ఇది నిజమే అయితే, శ్రీలీలకు కోలీవుడ్‌లో ఓ స్ట్రాంగ్ డెబ్యూ వచ్చినట్టే.