డార్లింగ్ సినిమా వచ్చి నేటికి 14 ఏళ్లు. ఆ రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే...?

ప్రభాస్ - కాజల్ కాంబోలో వచ్చిన డార్లింగ్ మూవీని తొలిప్రేమ ఫేం  కరుణాకరన్ దర్శకత్వం వహించాడు.

ప్రభాస్ సినిమాలో ది బెస్ట్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే.. ముందు వరుసలో డార్లింగ్ గురించే మాట్లాడుకుంటాం...

2010లో రిలీజ్ అయిన ఈ మూవీతో ప్రభాస్‌కు అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్‌ దగ్గర అయ్యారు.

ఛత్రపతి, బుజ్జిగాడు, బిల్లా లాంటి సినిమాలతో వచ్చిన మాస్ ఇమేజ్‌‌ను పక్కన పెట్టి ఈ లవ్ అండ్ రొమాంటిక్, ఫ్యామిలీ మూవీని చేశారు.

అయితే ఈ మూవీ ఆ రోజుల్లో ఎంత వరకు కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్ధాం...

డార్లింగ్ మూవీ ఆ రోజుల్లోనే 16.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి, 17 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది.

ఫుల్ రన్ ముగిసే సమయానికి డార్లింగ్ మూవీకి 23 కోట్ల షేర్ వచ్చింది. అంటే బయ్యర్లకు 6 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.

ప్రభాస్‌కు ఇలాంటి విజయం 5 ఏళ్ల తర్వాత వచ్చింది. (5 ఏళ్ల ముందు ప్రభాస్‌కు ఛత్రపతి మంచి విజయాన్ని అందించింది.)

2010 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ మూవీ నేటికి 14 ఏళ్లను పూర్తి చేసుకుంది.

ఇప్పటికీ ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా, సాధారణ ఆడియన్స్‌కు కూడా ఫేవరేట్ అని చెప్పొచ్చు.