PVR INOX లో ఇక నుంచి యాడ్ ఫ్రీ... కానీ, హైదరాబాదీలకు నిరాశే

ప్రతీ శుక్రవారం థియేటర్స్ అన్ని కొత్త సినిమాలతో నిండిపోతాయి. ప్రేక్షకలు సందడితో కిక్కిరిసిపోతాయి.

PVR INOX లాంటి మల్టీ ప్లేక్స్‌ లల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది.

ఇక థియేటర్స్ విషయానికి వస్తే PVR INOX కు ప్రత్యేక స్థానం ఉంటుంది. లగ్జరీగా సినిమా చూడాలి అనుకునే వాళ్లు వీటికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు.

కానీ, ఈ PVR INOX థియేటర్స్‌లో ఓ మైనస్ ఉంది. అదే యాడ్స్.

సినిమా ప్రారంభానికి ముందు 35 నిమిషాల పాటు వచ్చే యాడ్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతాయి.

ఈ యాడ్స్ వల్లే చాలా మంది సినిమా లవర్స్ PVR INOXకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించరు.

అయితే దీనిపై PVR INOX కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి PVR INOX థియేటర్స్‌లో యాడ్స్ టైంని 35 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.

కానీ, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది... ఇది హైదరాబాద్ నగరంలో ఉన్న PVR INOX థియేటర్లకు వర్తించదు.

ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న PVR INOXలలో ముందుగా ఈ యాడ్స్ టైంని తగ్గించబోతున్నారు.

అయితే 3 నెలల తర్వాత వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి అన్ని నగరాల్లో యాడ్స్ టైమింగ్స్ గురించి నిర్ణయం తీసుకుంటామని PVR INOX సీనియర్ పర్సన్ మీడియాకు చెప్పారు.