ఛాన్స్‌లు లేకున్నా.. రెమ్యునరేషన్‌లో పూజా డిమాండ్ వేరే లెవెల్
ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుని చేతులోకి వచ్చిన సినిమాలను వదులుకున్న బ్యూటీ పూజా హెగ్డే.
ఈమె కెరీర్ ఎంత స్పీడ్‌గా బిల్డ్ అయిందో... అంతే స్పీడ్‌గా కుప్పకూలింది అని చెప్పొచ్చు.
బుట్టబొమ్మగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నా... పూజా ప్రస్తుత్తం ఒకే ఒక్క సినిమా చేస్తుంది.
ఇలా ఛాన్స్‌లు లేని టైంలో, అవకాశం వస్తే ఎవరైనా వెంటనే ఒప్పేసుకుంటారు. కానీ, పూజా అలా చేయ్యడం లేదు.
ఈ మధ్య కాలంలో పూజాకు ఎన్టీఆర్ దేవర సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చిందట.
ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్... పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న మూవీ దేవర.. ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు పూజా కండీషన్స్ పెడుతుందట.
తనకు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తేనే... ఐటెం సాంగ్ చేస్తానని తెగేసి చెప్పేసిందట.
పూజా హీరోయిన్ పాత్రలు చేసినప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ 3 కోట్లు.
ఇప్పుడు ఛాన్స్ లు తగ్గాయి. ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడిపోయింది. ఈ టైంలో అవకాశం రావడమే గొప్ప అనుకుంటే... భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.
కాగా, పూజా హెగ్డే ఇప్పటికే రంగస్థలం మూవీలో జిగేల్ రాణి అనే ఐటెం సాగ్ చేసిన సంగతి తెలిసిందే.