ఫహాద్ ఫాజిల్ ఆవేశం మూవీపై సమంత రివ్యూ...

మయోసైటీస్‌తో సమంత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ, సినిమాలకు  మాత్రం దూరంగా ఉండటం లేదు.

ఖాళీ సమయాల్లో నచ్చిన సినిమాలను, సిరీస్‌లను చూస్తుంది. వాటి గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది.

తాజాగా సమంత ఓ సినిమాను చూడటమే కాదు, దాని రివ్యూను కూడా ఇచ్చేసింది. అది ఏ సినిమా అంటే... ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం.

ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం మూవీ మలయాళంలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఫహాద్ 22 ఏళ్ల కెరీర్‌లో ఆవేశం మూవీనే ఫస్ట్ 100 cr కలెక్ట్ చేసిన మూవీ.

అయితే ఈ మూవీని తాజాగా సామ్ చూసి, సినిమాలో అన్ని రకాల మ్యాడ్ నెస్ ఉందని, ఈ మ్యాడ్ తనకు చాలా నచ్చింది అంటూ రివ్యూ ఇచ్చింది.

ఈ సినిమాను చూసి సామ్ భయపడిందట.. కానీ, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే థియేటర్‌లో చూడాల్సిన కొన్ని సినిమాలు ఉంటాయి.. అందులో ఆవేశం కూడా ఒకటి అంటూ సామ్ తన రివ్యూలో చెప్పుకొచ్చింది.

ఈ ఆవేశం సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఏంజాయ్ చేయాలని సామ్ కోరింది.