చైతన్య కెరీరలో భారీ డిజాస్టర్... ఈ మూవీతో ఎంత నష్టం వచ్చిందంటే..? 

అక్కినేని వారసత్వం నుంచి వచ్చిన నాగ చైతన్య ఓ భారీ హిట్ కోసం చూస్తున్న రోజులు అవి.

కెరీర్ స్టార్టింగ్‌లో ఏమాయ చేసావే  ఓ క్లాసికల్ హిట్, ఒక లైల కోసం మూవీతో డీసెంట్ హిట్ కొట్టినా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేయ్యడం మాత్రం అపలేదు.

అ.. టైంలోనే వచ్చింది దోచేయ్ మూవీ. ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న కృతి సనన్‌కు ఇది రెండో తెలుగు మూవీ.

భారీ అంచనాలతో 24 ఏప్రిల్ 2015లో రిలీజ్ అయింది ఈ మూవీ.

నేటికి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపించిందో ఇక్కడ చూద్ధాం...

ఆ టైంలో దోచేయ్ మూవీకి 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఫైనల్ రన్‌లో ఈ సినిమాకు వచ్చింది కేవలం 6.75 కోట్లు మాత్రమే. అంటే ఈ సినిమాను నమ్ముకున్న బయ్యర్లు దాదాపు 7 కోట్ల వరకు నష్టపోయారు.

నైజం ఏరియాలో ఈ మూవీ 2.28 కోట్లు కలెక్ట్ చేయగా, ఏపీ మొత్తంగా 3.02 కోట్లు వచ్చాయి.

ఇలా నాగ చైతన్య కెరీర్ లో దోచేయ్ మూవీ ఓ డిజాస్టర్ గా మిగిలిపోయింది.