కమల్ సినిమాలో మీర్జాపూర్ సిరీస్ స్టార్స్ 

కమల్ హాసన్ కెరీర్ గురించి మాట్లాడితే, విక్రమ్‌కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి.

విక్రమ్ మూవీకి ముందు కమల్ సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేవు.

విక్రమ్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, కమల్ హాసన్‌ లోని పూర్తి యాక్టర్ బయటకు రావడానికి ఛాన్స్ వచ్చింది.

దీని తర్వాత కమల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్ని విలన్ పాత్రలు అయితే, థగ్ లైఫ్ మూవీలో హీరోగా చేస్తున్నాడు.

థగ్ లైఫ్‌ను డైరెక్టర్ మణిరత్నం భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు.

అందులో భాగంగానే, దుల్కర్ సల్మాన్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్ లాంటి నటులను తీసుకున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి జయం రవి తప్పుకున్నాడు. ఆ ప్లేస్ కోసం మణిరత్నం బాలీవుడ్ తలుపులు తట్టాడు.

ఈ నేపథ్యంలోనే మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో నటించిన అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి ఫైనల్ అయినట్టు సమాచారం.

ఇదే నిజం అయితే, థగ్ లైఫ్ మూవీకి బాలీవుడ్‌లో కూడా హైప్ రావడం గ్యారంటీ.