వీరమల్లు వివాదం... క్రిష్‌కు ఇది కొత్తేమీ కాదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ మూవీ హరి హర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.

ఈ మూవీ స్టార్ట్ అయి మూడేళ్లు అవుతున్నా... ఇంకా విడుదలకు నోచుకోలేదు.

ఇప్పుడు సడన్‌గా షూటింగ్ పూర్తి కాకపోయినా వరుసగా అప్టేట్స్ ఇస్తున్నారు.

ఇప్పుడు టీజర్ రిలీజ్ కాబోతుంది. ఇందు కోసం బ్యాక్ టూ బ్యాక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ పోస్టర్స్‌లో ఈ సినిమాకు ఇప్పటి వరకు డైరెక్టర్ గా ఉన్న క్రిష్ పేరు కనిపించడం లేదు.

దీనిపై ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తుంది. సినిమా కంప్లీట్ చేయలేక అనుష్కతో ఓ సినిమా స్టార్ట్ చేశాడు క్రిష్.

ఇది నిర్మాత రత్నంకు నచ్చలేదట. దీంతో తన కొడుకు జ్యోతి కృష్ణతో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

అందుకే టీజర్‌కు సంబంధించిన పోస్టర్స్‌లో క్రిష్ పేరు వాడటం లేదని సమాచారం.

అయితే ఇలాంటి వివాదం క్రిష్‌కు కొత్త కాదు. గతంలో మణికర్ణిక మూవీలో టైంలో కూడా కంగన రౌనత్ తో క్రిష్ కు గొడవ జరిగింది.

అప్పుడు కూడా మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నాడు. ఇప్పుడు వీరమల్లు విషయంలో కూడా అదే జరగబోతుంది.