డైరెక్టర్లే మారిపోయిన తెలుగు సినిమాలు 

రిక్షావోడు

ఈ మూవీకి ఫస్ట్ డైరెక్టర్ బి. గోపాల్. కానీ, కొన్ని కారణాల వల్ల కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.

సర్దార్ గబ్బర్  సింగ్

ఈ పవన్ కళ్యాణ్ మూవీని సంపత్ నంది డైరెక్ట్ చేయాల్సింది. కానీ, బాబీ కొల్లి డైరెక్ట్ చేశారు.

ఎన్టీఆర్ కథానాయకుడు &  ఎన్టీఆర్ మహానాయకుడు

ఈ రెండు సినిమాలను డైరెక్ట్ చేసింది క్రిష్. కానీ, ఫస్ట్ అనుకున్నది మాత్రం తేజను.

వెంకీ మామ

వెంకటేష్ - నాగ చైతన్య కలిసి చేసిన ఈ మూవీని బాబీ కొల్లి డైరెక్ట్ చేశాడు. కానీ, ఫస్ట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది మాత్రం కళ్యాణ్ కృష్ణ కురసాల.

శేఖర్ (2022 )

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా చేసిన ఈ సినిమాను ఆయన భార్య జీవిత డైరెక్టర్. కానీ, ముందుగా డైరెక్టర్ లలిత్.

దాస్ క ధమ్కీ

విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమాకు ఆయనే డైరెక్టర్. కానీ, ముందుగా అనుకున్న నరేష్ కుప్పిలి కొన్ని వివాదాల కారణంగా తప్పుకున్నారు.

డెవిల్

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ మూవీకి నిర్మాత అభిషేక్ నామా డైరెక్టర్ అని చెప్పుకున్నారు. కానీ, సినిమాలో చాలా వరకు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు.

కాటమరాయుడు

పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాను ఎస్ జే సూర్య డైరెక్ట్ చేయాల్సింది. కానీ, డాలీ దర్శకత్వం వహించాడు.

డిటెక్టివ్ 2

విశాల్ హీరోగా వచ్చిన ఈ సినిమాను మిస్కిన్ డైరెక్ట్ చేయాల్సింది. కానీ, కొన్ని వివాదాల కారణాంగా విశాలే డైరెక్ట్ చేశాడు.

మణికర్ణిక

ఈ సినిమాను క్రిష్ చాలా వరకు డైరెక్ట్ చేశాడు. కానీ, కంగనాతో వచ్చిన వివాదాల కారణంగా తప్పుకున్నాడు. దీంతో కంగనానే డైరెక్ట్ చేసింది.

హరి హర వీరమల్లు

పవన్ కళ్యాణ్ పీరియాడికల్ మూవీని క్రిష్ సగం వరకు దర్శకత్వం వహించాడు. మిగితా పార్ట్ కి క్రిష్ ను తప్పించి జ్యోతి కృష్ణతో చేయిస్తున్నారు.