Rashmi..గడిచిన కొన్నేళ్ల క్రితం వరకు బుల్లితెరపై బెస్ట్ జోడిగా పేరుపొందిన యాంకర్ లలో సుధీర్ (Sudheer), రష్మీ (Rashmi) జంట కూడా ఒకటి. ముఖ్యంగా రష్మీకి తెలుగు రాకపోయినా సరే సుధీర్ తో కలిసి చేసినటువంటి స్కిట్స్ , షోలు వంటివి మంచి పాపులారిటీ అందుకున్నాయి. దీంతో ఈమెకు హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకునేలా చేశాయి. ఇప్పటికీ యాంకర్ గా జబర్దస్త్ షో తో పాటు ఇతర షోలలో చేస్తూ ఉంది రష్మి. రష్మి యాంకర్ కాకముందు ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. కానీ అవేవీ ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కేవలం జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
నటించే అవకాశం అతనికే..
మల్లెమాల వారు నిర్వహించే ఎలాంటి షోలలోనైనా సరే గతంలో సుధీర్, రష్మి కచ్చితంగా ఉండేవారు.. ముఖ్యంగా ఈ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉన్నది. వీరిద్దరి పర్ఫామెన్స్ చూసి కచ్చితంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అనేంతలా నటిస్తూ ఉండేవారు. అయితే ఈ విషయాన్ని ఎప్పుడు అడిగినా కూడా వీరిద్దరు కేవలం స్కిట్ లో భాగంగానే ఇలాంటివి చేసామని తెలిపిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీ తనకు సంబంధించిన విషయాలన్నిటినీ కూడా తెలియజేసింది.
ప్రదీప్ కి ముద్దు పెడతా..
మొదట యాంకర్ మేల్ యాంకర్లతో మీకు అవకాశం వస్తే ఎవరితో నటిస్తారని అడగగా..సుధీర్ గురించి మాట్లాడుతూ.. సుధీర్ కేవలం జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత తనకు పరిచయమయ్యారని.. కానీ యాంకర్ ప్రదీప్ మాత్రం అంతకుముందు నుంచి తనకు బాగా పరిచయమని తెలియజేసింది. అందుకే సినిమాలలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా తాను మొదటగా ప్రదీప్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను అంటూ తెలియజేసింది. అలాగే ప్రదీప్ కి తనకు మధ్య మంచి బాండింగ్ ఉందంటూ తెలియజేసింది రష్మీ. అలాగే ముద్దు ఎవరికి, చంప దెబ్బ ఎవరికి అనే ప్రశ్నకి అడిగేసరికి.. హైపర్ ఆదికి చెంపదెబ్బ ఇస్తానని.. సుధీర్ కి వార్నింగ్ ఇస్తానని.. ప్రదీప్ కి ముద్దు పెడతానంటూ తెలియజేసింది రష్మీ.
100 ఎకరాల భూమిపై క్లారిటీ..
అలాగే గతంలో రష్మీకి 100 ఎకరాలు భూమి ఉంది అనే విషయం పైన యాంకర్ అడగగా.. తనకు 100 ఎకరాలు అయితే లేవు కాని తన అమ్మ తరుపున ఒరిస్సాలో కాస్త భూమైతే ఉన్నదంటూ తెలియజేసింది. ఫైనల్ గా అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న తన పెళ్లి పైన అడుగుతూ.. మీకు ఎలాంటి భర్త కావాలి అని అడగగా.. ఈ విషయం పైన రష్మి కాస్త ట్విస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. తనకు అసలు వివాహం చేసుకోవాలనే ఉద్దేశమే లేదని, అందుకే తనకు ఎలాంటి భర్త రావాలని తాను కోరుకోవడం లేదని తెలిపింది రష్మీ. దీంతో సుధీర్ తో పెళ్లి పైన కూడా రష్మి ఈ ఆలోచనతోనే వుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మాత్రం రష్మీ , సుధీర్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం అని చెప్పవచ్చు.