Jabardasth: ఇల్లీగల్ ఎఫైర్.. చిక్కుల్లో పడ్డ బుల్లెట్ భాస్కర్..!

Jabardasth.. తెలుగు బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షో గా గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంతోమంది పరిచయం అవ్వడమే కాదు.. స్టార్ హీరో హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు కూడా తమ అద్భుతమైన టాలెంట్ ని ఉపయోగించుకుంటూ ఏకంగా కొంతమంది హీరోలుగా అవకాశాలు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా అనసూయ వంటి లేడీ యాంకర్లు కూడా ఈ జబర్దస్త్ షో ద్వారానే భారీ పాపులారిటీ సొంతం చేసుకుని.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తూ ఏకంగా పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు అంటే కేవలం జబర్దస్త్ ద్వారానే అని చెప్పవచ్చు.

Jabardasth: Illegal affair.. Bullet Bhaskar is in trouble..!
Jabardasth: Illegal affair.. Bullet Bhaskar is in trouble..!

జబర్దస్త్ కి పూర్వ వైభవం వచ్చేనా..

ఇకపోతే ఒకప్పుడు సుడిగాలి సుధీర్ , హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లాంటి కమెడియన్స్ జబర్దస్త్ స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. అయితే ఇప్పుడు వీరంతా సినిమాలలో బిజీ కావడం వల్ల జబర్దస్త్ నుంచి దూరం అయిపోయారు.ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ .. రాకెట్ రాఘవ , రాకింగ్ రాకేష్ లాంటి వాళ్లు కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. అయితే వీళ్ళు మాత్రం వారిలాగా పూర్తిస్థాయిలో సక్సెస్ కావడం లేదు.. జబర్దస్త్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ..శక్తి మేరా నవ్వించే పనిలో పడ్డారు. ఇకపోతే సీనియర్ జబర్దస్త్ కమెడియన్స్ లో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకరు.. చాలాకాలంగా జబర్దస్త్ కమెడియన్ గా, టీం లీడర్ గా కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇల్లీగల్ ఎఫైర్ పై స్కిట్.. బుల్లెట్ భాస్కర్ కి తిప్పలు తప్పవా..

ఒకప్పుడు సునామీ సుధాకర్ ఈయన టీం లో ఉండేవారు.. ప్రస్తుతం ఫైమా, పొట్టి నరేష్ తో మాత్రమే స్కిట్ చేస్తూ దూసుకుపోతున్నారు భాస్కర్ .. ఈమధ్య సమకాలీన పరిస్థితులు, సంఘటనల ఆధారంగా స్కిట్స్ రాసుకుంటూ వెళ్తున్న బుల్లెట్ భాస్కర్… గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సంఘటనలను తన స్కిట్స్ రూపంలో కామెడీగా ప్రజెంట్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.. మొత్తంగా కొన్ని స్కిట్ ల నేపథ్యంలో వార్తల్లో కూడా నిలుస్తున్నాడని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో మిస్ వైజాగ్ ఇల్లీగల్ వ్యవహారం సంచలనం రేపింది.. మోడల్ అండ్ యాక్టర్ అయిన ఒక వ్యక్తి.. భార్య కూతుర్ని దూరం పెట్టి.. ఇంకొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని ఫ్లాట్లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసిన భార్య.. కూతురితో సహా ఫ్లాట్ ఎదుట బైఠాయించి ధర్నాలు చేసింది.. తనకు న్యాయం చేయాలి అని మీడియాలో కోరుకుంది.. ఇక ఈ ఉదంతాన్ని స్కిట్ రూపంలో ప్రదర్శించాడు బుల్లెట్ భాస్కర్ అండ్ టీం.. ఫైమా, పొట్టి నరేష్ కూడా స్కిట్లో ఎప్పటిలాగే నవ్వులు పోయించారు అయితే ఇల్లీగల్ ఎఫైర్ వుదంతాన్ని స్కిట్ రూపంలో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు బుల్లెట్ భాస్కర్.. కానీ ఇలాంటి స్కిట్స్ వల్ల తప్పకుండా రిస్క్ ఎదురవుతుంది.. గతంలో కూడా హాస్యం కోసం వేసిన గెటప్స్ , చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.. హైపర్ ఆది పంచ్ లపై నిరసనలు వ్యక్తం చేయగా.. బలగం డైరెక్టర్ వేణు కల్లుగీత కార్మికుల మీద జోక్స్ చేస్తూ చేసిన స్కిట్ వివాదం వల్ల ఆయనపై దాడి కూడా చేశారు.. ఇక ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ కూడా చిక్కుల్లో పడ్డారు అని చెప్పడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు