Anchor Suma : బుల్లితెర లెజండరీ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్ గా రాణిస్తుంది. కేవలం బుల్లితెర షోలు మాత్రమే కాదు . మూవీ ఈవెంట్స్ చేస్తుంది. అలాగే కొన్ని యాడ్స్ కూడా చేస్తుంది. అందులో కొన్ని మాత్రం ఆమెకు డబ్బులతో పాటుగా ఫేమ్ ను అందిస్తున్నాయి. తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ ఆమెను వివాదంలోకి నెట్టేసింది. గతంలో సుమ చేసిన ఓ యాడ్ కారణంగా పలువురు సామాన్యులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామంటూ వాపోతున్నారు. తాజాగా ఈ వివాదం పై సుమ స్పందించింది. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.
రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్‌కి సంబంధించిన యాడ్‌లో సుమ చెప్పినందుకే తాము ఫ్లాట్స్ కొన్నామని ఇప్పుడు మోసపాయామని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొందరు బాధితులు ఆమెకు నోటీసులు కూడా పంపించారు. రాకీ అవెన్యూస్ సంస్థ వివాదం, మోసంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ రాకీ అవెన్యూస్ మోసం పై స్పందించారు. ఈ వివాదం పై తాజాగా సుమ స్పందించి వివరణ ఇచ్చారు.
ఆంద్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. సొంతిల్లు ఇస్తామని నమ్మించి మొత్తం రూ. 88 కోట్ల వరకు సేకరించిన తర్వాత రాకీ అవెన్యూస్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సుమ ఆ కంపెనీకి ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. రాకీ అవెన్యూస్ మోసాలతో తనకు సంబంధం లేదని యాంకర్ సుమ స్పష్టం చేశారు. ఆ సంస్థతో తన అగ్రిమెంట్ ఎప్పుడో ముగిసిందని వివరించారు. 2016 నుంచి 2018 మధ్య రాకీ అవెన్యూస్ సంస్థకు యాడ్స్ చేశామని తెలిపారు.. అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా తన పర్మిషన్ లేకుండా ఆ యాడ్ ను వాడుకున్నట్లు సుమ చెప్పారు. ఈ విషయం పై తనకు నోటీసులు అందాయని ఆమె అన్నారు. తానూ కూడా భాదితులకు న్యాయం చెయ్యాలని ఆ సంస్థకు నోటీసులు పంపినట్లు చెప్పారు.
View this post on Instagram
తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక నోట్ ను సుమ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పలువురు బాధితులు స్పందిస్తున్నారు. డబ్బుల కోసం ఏదైన చేస్తావా ? కంపెనీ గురించి తెలియకుండానే యాడ్ చేసావా ? నీ మీద నమ్మకంతోనే ఆ ఫ్లాట్లు కొంటె ఇప్పుడు నాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై సుమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..