SSMB-29.. దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఎస్ఎస్ఎంబి 29 (SSMB -29)అనే వర్కింగ్ టైటిల్ తో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ (RRR ) సినిమా తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఒక్క పాన్ ఇండియా ప్రేక్షకులే కాదు గ్లోబల్ స్థాయిలో అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ( Mahesh Babu), రాజమౌళి (Raja mouli) కాంబినేషన్లో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సినిమాపై హైప్ పెంచడానికి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) అప్పుడప్పుడు కొన్ని విషయాలు షేర్ చేస్తూ వస్తున్నారు.
గ్రాఫిక్ వర్క్ 40% పూర్తి..
అందులో భాగంగానే ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఉంటుందని, ఇప్పటికే ఆఫ్రికన్ అడవులలో సినిమా షూటింగ్ కి కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ వార్తలు వినిపిస్తూ ఉండగా.. ఇప్పుడు మరొకసారి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్తలు తెరపైకి వచ్చాయి. అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే గ్రాఫిక్ వర్క్ 40% పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూరోప్ (Europe ) లో ఈ గ్రాఫిక్ వర్క్ చేయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హీరో మహేష్ బాబు సన్నివేశాలన్నీ కూడా చాలా వరకు బ్లూ మ్యాట్ లో షూట్ చేశారట. ఇక ఈ విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా మొత్తం అవతార్ స్టైల్ లో ఉండబోతోందా అంటూ అభిమానులలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.
అవతార్ ను తలపిస్తుందా..
సాధారణంగా సినిమా షూటింగ్ లకు గ్రాఫిక్ వర్క్ అంటే ఎక్కువగా గ్రీన్ మ్యాట్ లో జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా బ్లూ మ్యాట్ లో జరిగే సరికి అందరూ అవతార్ లా ఉండబోతుందా అంటూ సరికొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టనే లేదు. అప్పుడే ఇలాంటి అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో వీటిపై రాజమౌళి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
షూటింగ్ మొదలవలేదు.. అప్పుడే కొత్త అనుమానాలు..
నిజానికి రాజమౌళి టేకింగ్ కి, విజువల్స్ కి అభిమానులు ఫిదా అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాను ఈయన టేకింగ్ చేసిన విధానం ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్స్ ని కూడా మెప్పించింది. ఇలాంటి డైరెక్టర్ పై ఇప్పుడు సరికొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలే ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమను దాటి బయట ఇండస్ట్రీకి అడుగుపెట్టని మహేష్ బాబు, రాజమౌళిని నమ్మి తొలిసారి పాన్ వరల్డ్ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నారు. మరి ఆయన ఆశలు రాజమౌళి ఏ మేరకు నెరవేర్చుతారు అనే అనుమానాలు కూడా అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే రాజమౌళి టేకింగ్ విషయంలో అనుమానాల అవసరం లేదంటూ కొంతమంది సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు . మరి రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.