Sobhita.. గత రెండు రోజుల నుంచి అక్కినేని కుటుంబం గురించి ఏదో ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతూనే ఉంది. ముఖ్యంగా అమలా, శోభిత గురించి ఏవో ఒక విషయం అయితే వినిపిస్తూ ఉంది.నాగార్జున మొదటి భార్య హీరో వెంకటేష్ చెల్లెలు దగ్గుబాటి లక్ష్మి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరికి జన్మించిన కుమారుడే నాగచైతన్య. నాగచైతన్య పుట్టిన కొద్ది సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అటు నాగార్జున , లక్ష్మి కూడా విడిపోవడం జరిగింది. ఆ తరువాతే హీరోయిన్ అమలాను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు నాగార్జున.
వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన అమల..
అమలా కూడా వివాహానికి ముందే చాలా గ్లామర్ రోల్స్ పాత్రలలో కూడా నటించేది. కానీ నాగార్జునతో వివాహమైన తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం ఇంటి బాధ్యతలను మాత్రమే చూసుకుంటోంది. అయినా సరే సినిమాల మీద ఇష్టాన్ని కోల్పోకుండా.. అడపా దడపా సినిమాలో నటించినా..అది కూడా ఎక్కువగా తల్లి క్యారెక్టర్లలో నటిస్తూ ఉండేది అమల. ఇక నాగ చైతన్య లైఫ్ లోకి సమంత రావడంతో నాగచైతన్య కెరియర్ మలుపు తిరుగుతుంది అనుకునే సమయంలో అనూహ్యంగా విడిపోవడం జరిగింది. అయితే వివాహం తర్వాత సమంత కూడా ఎక్కువగా గ్లామర్ షో చేయడం వల్ల నాగచైతన్య ,సమంత మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు అనే విధంగా వార్తలు వినిపించాయి.
అక్కినేని కండీషన్ కి ఒప్పుకున్న శోభిత..
ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇది కూడా ప్రేమ వివాహమే. దీంతో నాగచైతన్య తన తండ్రి నాగార్జునను ఫాలో అవుతున్నారనే విధంగా పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ శోభిత కెరియర్ అయితే గ్లామర్ రోల్స్ పాత్రలలో అద్భుతంగా నటిస్తూ ఉంటుంది. మరి వివాహమయ్యాక కూడా అమల లాగే యాక్టింగ్ కి శోభిత పులిస్టాప్ పెడుతుందా అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులలో మొదలవుతోంది. శోభిత కూడా అమల లాగే హౌస్ వైఫ్ గా ఉండాలనే కండిషన్ ని నాగార్జున కుటుంబం పెట్టిందనే విధంగా వార్తలయితే వినిపిస్తున్నాయి.
అమల దారిలో శోభిత..
మరి వివాహం తర్వాత శోభిత యాక్టింగ్ వైపు అడుగులు వేస్తుందా లేకపోతే అమలా లాగా కుటుంబం వైపు అడుగులు వేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
కండిషన్ ఒప్పుకోకపోవడం వల్లే సామ్ విడాకులు..
నిజానికి ఈ కండీషన్ వల్లే సమంత, నాగచైతన్య నుంచి విడిపోయిందని వార్తలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించింది. అలాంటి పాత్రలు చేయకూడదని సమంతకు కండీషన్ పెట్టిందట నాగార్జున ఫ్యామిలీ. సినిమానే జీవితం అని బ్రతుకుతున్న సమంతకు ఇలాంటి కండీషన్ ఎదురవడంతో కట్టుకున్న భర్తని కూడా దూరం చేసుకుంది అనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ సమంత అయితే విడిపోయింది. మరి శోభిత నాగచైతన్య ఫ్యామిలీ కండీషన్లను ఒప్పుకొని ఆయనతో కలకాలం కలిసి ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.