SaripodhaaSanivaaram : బాక్స్ ఆఫీస్ పై సూర్య శివతాండవం… ఇప్పుడు సరిపోయింది..

SaripodhaaSanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ కే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, తర్వాత స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. అంటే సుందరానికి సినిమా తర్వాత నాని (Nani) – వివేక్ ఆత్రేయ (vivek atreya) కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ భారీగా అంచనాలు పెట్టుకోగా, మరీ ఓ రేంజ్ లో కాకపోయినా, బాగానే ఉందన్న టాక్ తెచ్చుకుంది. ఇక మొదటి వారం రోజుల్లో మంచి వసూళ్లనే సాధించిన సరిపోదా శనివారం పది రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. అయితే రెండో వారం ఇతర సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా మంచి హోల్డ్ ని చూపించింది.

Saripodhaa Sanivaaram movie crossed 100 crores mark

బాక్స్ ఆఫీస్ పై శివతాండవం వంద కోట్ల జాతర..

ఇక నాని సరిపోదా శనివారం సినిమా (Saripodhaa Sanivaaram) ప్రీమియర్స్ నుండే ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించగా, తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం వల్ల కలెక్షన్లు తగ్గినా, హోల్డ్ చూపించింది. తర్వాతి వారాల్లో పలు క్రేజీ సినిమాలు రిలీజ్ అయినా డీసెంట్ హోల్డ్ చూపించగా, వర్కింగ్ డేస్ లో తడబడినా, వీకెండ్ లో పుంజుకుంది. ఇక తాజాగా సరిపోదా శనివారం అరుదైన ఫీట్ ని సాధించింది. నాని సరిపోదా శనివారం తాజాగా 100 కోట్ల కలెక్షన్స్ ని సాధించినట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక దసరా తర్వాత నానికి ఇది రెండో వంద కోట్ల సినిమా అని చెప్పాలి. అంతే కాదు దసరా, హాయ్ నాన్న సినిమాల తర్వాత సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నాడని చెప్పాలి.

- Advertisement -

ఇప్పుడు లెక్క సరిపోయింది..

అయితే నాని సరిపోదా శనివారం సినిమా ఇప్పటివరకు మూడో వీకెండ్ కూడా కలుపుకుని 95 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, మేకర్స్ మాత్రం అప్పుడే వంద కోట్ల పోస్టర్ ని వదలడం గమనార్హం. అయితే ప్రస్తుతం సరిపోదా శనివారం చూపిస్తున్న హోల్డ్ ని బట్టి సినిమా ఈ వారం లో ఆ మార్క్ ని అఫిషియల్ గా బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. ఇక సరిపోదా శనివారం నానితో పాటు, ఎస్.జె. సూర్య, వివేక్ ఆత్రేయ డైరెక్షన్, జెక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా సినిమా ఇంత భారీ విజయం సాధించడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా సరిపోదా శనివారం కలెక్షన్స్ 105 కోట్ల వరకు రాబట్టొచ్చని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు