Kalki2898AD : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా థియేటర్లలో ఏ రేంజ్ భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా మైథలాజికల్ టచ్ తో కూడిన సైంటిఫిక్ ఆక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ప్రీమియర్స్ నుండే యానానిమస్ టాక్ తో రికార్డులు బద్దలు కొడుతూ వస్తుంది. తొలి రోజు నుండే రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా విడుదలై నెలన్నర కావస్తున్నా, ఇప్పటికీ లిమిటెడ్ స్క్రీన్స్ లో స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తూ యాభై రోజులకు పరుగులు తీస్తుంది. అయితే కల్కి సినిమా ని రిలీజ్ తర్వాత కూడా మరింత ప్రమోట్ చేస్తూ ఉంటే మరి కొన్ని రికార్డులు నమోదయ్యేవని ఫ్యాన్స్ అంటున్నారు.
సాలిడ్ రికార్డ్ మిస్ అయిన కల్కి..
అయితే ఇప్పుడు ఆగష్టు 15న అన్ని ఇండస్ట్రీలలో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అన్ని థియేటర్లలో దాదాపు కల్కిని తీసేస్తున్నారని సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో ఒక్క సాలిడ్ హాలిడే దొరికినా బాక్స్ ఆఫీస్ పై మంచి రికార్డ్ నమోదయ్యేదని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కల్కి 296 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఒక్క మంచి హాలిడే డే దొరికినా 300 కోట్ల క్లబ్ లో చేరేది. అలాగే హిందీలో కూడా కల్కి ఇప్పటివరకు 294 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరో రెండు రోజులు హాలిడే వీక్ దొరికినా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండింట్లో ఏది వచ్చినా కల్కి ఖాతాలో అరుదైన రికార్డ్ ఉండేది.
అన్ సీజన్లో లాంగ్ రన్…
ఇక కల్కి (Kalki2898AD) సినిమా సమ్మర్ లో వాయిదా పడి అన్ సీజన్లో రిలీజ్ అయినా కూడా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుందని చెప్పాలి. ముఖ్యంగా పెద్దగా ఫెస్టివల్ హాలిడేలు లేకపోయినా భారీ వసూళ్లు సాధించిందని చెప్పాలి. ఇప్పటికే 1100 కోట్లకి పైగా వసూలు చేసిన కల్కి సినిమా అతి త్వరలో యాభై రోజుల పరుగును పూర్తి చేసుకోనుంది. ఇక ఆగష్టు 15ఆ తెలుగు లో మూడు పెద్ద సినిమాలు, హిందీలో కూడా మూడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో కల్కిని ఉన్న థియేటర్లలోంచి తీసేస్తారని సమాచారం. ఇక కల్కి2898AD సీక్వెల్ మాత్రం రెండేళ్ల తర్వాతే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.