Martin.. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని, పట్టాలెక్కి, షూటింగ్ కంప్లీట్ చేసి, సెన్సార్ పూర్తి చేసుకొని తెరపైకి వచ్చేవరకు కూడా ఆ సినిమా పూర్తయింది అని చెప్పలేం. అయితే కొన్ని కొన్ని కారణాలవల్ల షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ కూడా విడుదల వాయిదా పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోని వివిధ కారణాల వల్ల ఇప్పటికీ విడుదలకు నోచుకోని సినిమాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నిర్మాతలు – దర్శకుల మధ్య గొడవలు రావడం లేదా హీరోకి – నిర్మాతకి మధ్య విభేదాలు ఏర్పడడం, దీనికి తోడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా కొన్ని కారణాలవల్ల సినిమాలు పట్టాలెక్కినా.. విడుదల కాకుండా ఆగిపోతూ ఉంటాయి. ఇప్పుడు అలా భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఒక సినిమా కూడా ఇలాగే ఆగిపోయింది అని తెలుస్తోంది.
మార్టిన్ ఆగిపోనుందా…
అదేదో కాదు మార్టిన్. కన్నడ భాష ఇండస్ట్రీకి చెందిన ఈ సినిమా దాదాపు 8 భాషలలో విడుదల కాబోతోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు మొత్తం ఎనిమిది భాషలలో విడుదల కాబోతోంది. అక్టోబర్ 11 2024న విడుదల కావాల్సిన ఈ మార్టిన్ సినిమా..ఆ తేదీన విడుదల కాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆర్థిక ఇబ్బందులేనట. ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా ఈ సినిమా ఆగిపోతోందనే వార్తలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే అక్టోబర్ 11 వరకు ఎదురు చూడాల్సిందే..
ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం..
అయ్యో పాపా అర్జున్ దర్శకత్వం వహించిన కన్నడ భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మార్టిన్. అర్జున్ సర్జా రచయితగా పనిచేయగా, ఉదయ్ కే మెహతా ఈ సినిమాను నిర్మించారు .ఈ చిత్రంలో ధృవ సర్జ హీరోగా నటిస్తూ ఉండగా.. ఆయనకు జోడిగా వైభవి శాండిల్య హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు అన్వేషి జైన్ ,సుకృత వాగ్లే , అచ్యుత్ కుమార్ , నికితిన్ దీర్ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక నెల క్రితం సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ దాదాపు 98 మిలియన్ వ్యూస్ కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , ఈ సినిమా ఇప్పుడు ఆగిపోతోంది అనే వార్తలు అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇక నిజంగానే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి వుంటుంది.
ధ్రువ సర్జ కెరియర్..
ఈ సినిమా హీరో ధ్రువ సర్జ విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ధ్రువ సర్జ గౌడ 2012 అద్దూరి అనే చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఈయన అన్నయ్య ఎవరో కాదు దివంగత నటులు చిరంజీవి సర్జ. ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రేరణ తో 2018 డిసెంబర్ 9న నిశ్చితార్థం చేసుకొని, పెద్దల సమక్షంలో 2019 నవంబర్ 25న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ధ్రువ సర్జ తన అద్భుతమైన నటనతో ఏకంగా మూడుసార్లు సైమా అవార్డులతో పాటు సువర్ణ ఫిలిం అవార్డ్స్ అలాగే ఉదయ ఫిలిం అవార్డులను కూడా దక్కించుకున్నారు.