Jr.NTR.. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర చిత్రంలో బిజీగా ఉన్నారు.. ఈ చిత్రం కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఎక్సైట్ గా ఎదురు చేస్తున్నారు. ఈ సినిమా అయిపోగానే బాలీవుడ్ లో వార్ -2 సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు.. ఆ తర్వాత చిత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఉండబోతోంది. ఆగస్టు 8వ తేదీన రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా జరిగాయి. ముఖ్యంగా ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా కూడా వచ్చారు.
ఖరీదైన వాచ్ ధరించిన ఎన్టీఆర్..
అయితే ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా ఈ వేడుకకు రావడంతో అభిమానులు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ధరించిన వాచ్ అక్కడ చాలా హైలెట్ గా నిలిచింది. దీంతో అభిమానులు సైతం ఈ వాచ్ ధర ఎంత ఉంటుందనే విషయాన్ని గూగుల్లో వెతకగా ఈ వాచ్ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ కట్టుకున్న ఈ వాచ్ స్విట్జర్లాండ్ లో ప్రముఖ బ్రాండెడ్ లో ఒకటైన పాటక్ ఫిలిఫ్ అనే బ్రాండెడ్ వాచ్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ వాచ్ ధర రూ.1.75 కోట్ల రూపాయలు ఉన్నదట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఎన్టీఆర్ సినిమాలు..
గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా ఫంక్షన్ కు ఇలాంటి వాచ్ తోనే హాజరైనట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని కూడా పెట్టబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల విషయాలను కూడా చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతుందట. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ దేవర సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా లెంత్ ఎక్కువగా ఉండడంతో రెండు భాగాలుగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అనిరుద్ సంగీతాన్ని అందించారు.
ఎన్టీఆర్ కెరియర్..
ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నటించింది ఆపెట్టుకున్నారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజస్ సంఘం చేసుకున్న అతి తక్కువ సమయంలోనే వారికి పార్టీ సొంతం చేసుకొని ఇప్పుడు అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి ఖరీదైన, దుస్తులు, వాచీలు, వస్తువులు ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఏదేమైనా ఎన్టీఆర్ కు సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలు రోజుకి ఒకటి వైరల్ అవుతూ ఉండడంతో ఆయనను మరింత పాపులారిటీ చేసేస్తున్నాయని చెప్పవచ్చు.