Janhvi kapoor.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR) , రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ తో నటించాలని చాలామంది హీరోయిన్లు ఆత్రుత పడుతూ ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi kapoor) మాత్రం ఎన్టీఆర్ తో సినిమా అనేసరికి కాస్త వెనుకడుగు వేసిందట. నిజానికి సీనియర్ ఎన్టీఆర్b(Sr. NTR ) తో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీదేవి (Sridevi).. ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించి తెలుగు ఇండస్ట్రీలో.. నేను, మీ తాతగారు మంచి జోడిగా పేరు తెచ్చుకున్నాము. ఇక నా కూతురు తెలుగులో మొదటిసారి అడుగు పెడితే అది నీ సినిమాతోనే అడుగు పెట్టాలి. అదే నా చివరి కోరిక అంటూ ఎన్టీఆర్ తో చెప్పిందట శ్రీదేవి. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఒక రోజు శ్రీదేవి మరణాంతరం వెల్లడించారు.
ఎన్టీఆర్ తో నటించడానికి నిరాకరించిన జాన్వీ కపూర్..
ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేకపోయింది. కానీ ఎట్టకేలకు కొరటాల శివ (Koratala Shiva), జాన్వి కపూర్ ను ఎన్టీఆర్ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపడుతున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో నటించడం మొదటి ఇష్టం లేదని , కానీ ఆ ఒక్కరి వల్లే తాను ఎన్టీఆర్ తో నటించడానికి ఒప్పుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు బాలీవుడ్ మీడియా కథనాల ద్వారా వార్తలు వినిపిస్తున్నాను. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కరణ్ జోహార్ వల్లే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ..
దేవర సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న జాన్వి కపూర్.. మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకోబోతోందని అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఈమెకు సంబంధించి విడుదలైన లుక్స్ , పాటలు అన్నీ కూడా విపరీతంగా అలరిస్తున్నాయి. పాటలలో ఎన్టీఆర్ తో సమానంగా స్టెప్పులేస్తూ అదరగొట్టింది. ఇకపోతే జాన్వీ కపూర్ కు తొలిసారి తెలుగులో అవకాశం వచ్చినప్పుడు.. ఈ విషయాన్ని బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత, నటుడు అయినటువంటి కరణ్ జోహార్ తో చెబితే.. ఆయన మారు మాట్లాడకుండా ఓకే చెప్పేసేయ్ అంటూ చెప్పాడట. ఆ హీరోతో ఇండస్ట్రీలోకి అడుగు పెడితే కచ్చితంగా నువ్వు స్టార్ అయిపోయినట్టే అని భరోసా కూడా ఇచ్చారట. ఇక జాన్వి కరణ్ జోహార్ మాటలు విని దేవర సినిమాకి ఓకే చెప్పింది అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం జాన్వి కపూర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్తలు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా మరోవైపు రామ్ చరణ్ సినిమాలో కూడా ఇప్పుడు అవకాశం దక్కించుకుంది. నాని సినిమాలో కూడా అవకాశం లభించింది . మొత్తానికైతే ఎన్టీఆర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న ఈమె.. ఈ సినిమా ఫలితం తెలియక ముందే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం గమనార్హం. సినిమా ఫలితం తెలియక ముందే ఈ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయంటే సినిమా సక్సెస్ అయితే ఈమె రేంజ్ ఎక్కడికి వెళ్తుందో ఊహించవచ్చు.