Janhvi kapoor.. టాలీవుడ్ , బాలీవుడ్ భాషా చిత్రాలలో నటించి హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది దివంగత సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. సినీ బ్యాగ్రౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, సొంతంగా తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా సినిమా అవకాశాలనైతే అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ఎన్నో ఏళ్ళు అవుతున్నా.. సరైన సక్సెస్ ని అందుకోలేకపోతోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ కి ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇంస్టాగ్రామ్ లో ప్రమోషన్స్ తో పాటు పలు రకాల వ్యాపారాలలో పెట్టుబడుల పెడుతూ కూడా భారీగానే సంపాదిస్తోంది.
ఖరీదైన కార్ కొనుగోలు జాన్వీ..
ఇప్పుడు తాజాగా జాన్వీ కపూర్ ఒక సరి కొత్త కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అది కూడా ఇలాంటి కార్ కేవలం బాలీవుడ్ హీరోయిన్లలో ఈమె దగ్గర మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరో రణబీర్ కపూర్ తో పాటు మరెవరి దగ్గర ఈ కారు లేదట. మరి జాన్వీ కపూర్ కొనుగోలు చేసిన ఆ కారు ఏంటి అంటే. జాన్వీ కపూర్ కొన్న ఆ కారు LEXUS LM -350 కారును సైతం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్ ధర విషయానికి వస్తే , దీని ధర ఎక్స్ షోరూం విలువ అక్షరాలా రూ.2.50 కోట్లు ఉంటుందట. అలాగే ఫిట్టింగ్ రిజిస్ట్రేషన్ ఖర్చులతో కలుపుకొని సుమారుగా 3 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.
LEXUS LM -350 కార్ ప్రత్యేకతలు..
LEXUS LM -350 కారు చాలా లగ్జరీ గా కనిపిస్తోంది.. ఈ కారులో చాలా విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉన్నాయట. ఇందులోని సీట్లు కూడా చాలా మసాజింగ్ టైపు గా కలిగి ఉంటాయట. వాతావరణాన్ని బట్టి ఇందులో మన క్లైమేట్ ని సెట్ చేసుకునే సదుపాయం కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా టీవీ చూడడానికి కూడా సీటు కు ప్రత్యేకమైన సిస్టం ని అమర్చారట. అలాగే సన్ లైట్ పడడానికి కూడా ఒక ప్రత్యేకమైన సెటప్ ని ఈ కారులో అమర్చారట. మొదట ఈ కారుని రణబీర్ కపూర్ రూ.2.80 కోట్లు పెట్టి కొనుగోలు చేశారట ఆ తర్వాతే జాన్వీ కపూర్ ఈ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్ ను జపాన్ నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.
జాన్వీ కపూర్ సినిమాలు..
జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్లో దేవర సినిమాతో పాటు RC-16 చిత్రంలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఒకవైపు బాలీవుడ్ మరొకవైపు టాలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉన్నది జాన్వీ.. ఒక్కో చిత్రం కోసం రూ .5 నుంచి రూ .7కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం.