Janaka ayithe Ganaka : సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా సరే ఒక కథను రూపొందించేటప్పుడు.. ఒక హీరోని మైండ్ లో పెట్టుకొని ఆ కథను రాసుకుంటారు. అయితే ఆ కథను తాము అనుకున్న హీరోకి వినిపించినప్పుడు వారికి నచ్చితే నటిస్తారు. లేకపోతే ఆ కథ ఇంకొక హీరో దగ్గరకు వెళుతుంది. అయితే ఇక్కడ ఒక సినిమా కథను ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని రాసి, అదే హీరోకి వినిపించగా.. ఆ కథ ఆ హీరోకి నచ్చి నటించాలనుకున్నారు. కానీ అనుకోకుండా మధ్యలోనే ఆయన తప్పుకోవడంతో ఆ కథ ఇంకొక యంగ్ హీరో దగ్గరకు రావడం జరిగింది. ఇప్పుడు అదే కథ ఆ యంగ్ హీరోని స్టార్ హీరోగా మార్చబోతోంది. మరి ఏంటా కథ..? ఎవరా హీరోలు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
విడుదల వాయిదా పడిన జనక ఐతే గనక..
కలర్ ఫోటో సినిమాతో తనలోని టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించిన యంగ్ హీరో సుహాస్ (Suhas) తాజాగా నటిస్తున్న చిత్రం జనకా ఐతే గనక (Janaka ayithe Ganaka). సంగీర్తన హీరోయిన్ గా , శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 5వ తేదీ విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 12 కి విడుదల వాయిదా వేశారు చిత్ర బృందం.
నువ్వే నాకు లోకం అంటూ ఆకట్టుకుంటున్న లిరికల్ సాంగ్..
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇక తాజాగా కొన్ని గంటల క్రితం విడుదల చేసిన “నువ్వే నాకు లోకం” అనే లిరికల్ సాంగ్ కూడా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, కార్తీక్ గానాలాపన చేశారు.
ఇంత గొప్ప కథను మిస్ చేసుకున్న నాగచైతన్య..
ఇకపోతే దూరమైన భార్యపై తన ప్రేమను వ్యక్తం చేస్తున్న భర్త, మనసులోని బాధ, ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే జనక ఐతే గనక అనే సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. అయితే ఇంత మంచి సినిమాని ఒక స్టార్ హీరో మిస్ చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya). నాగచైతన్యకి దర్శకుడు ఈ సినిమా కథ వినిపించినప్పుడు ఆయన ఇంప్రెస్ అయిపోయి.. షూటింగ్ కూడా మొదలు పెట్టాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాలవల్ల నాగచైతన్య ఈ కథ నుంచి తప్పుకోవడంతో యంగ్ హీరో సుహాస్ లక్కీ ఛాన్స్ వరించింది. మొత్తానికైతే ఒక గొప్ప కథను నాగచైతన్య మిస్ చేసుకున్నారని చెప్పవచ్చు.
నాగచైతన్య సినిమాలు..
ఇకపోతే మరొకవైపు నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. ఒకవైపు సినిమాలతో కెరియర్ ను మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సమంతకు విడాకులు ఇచ్చి దూరమైన తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు నాగచైతన్య.