Hero Darshan.. ప్రముఖ కన్నడ హీరో దర్శన్ తూగుదీప (Darshan thugudeepa)అభిమాని హత్య కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు పవిత్ర గౌడ(Pavitra Gowda) కోసం అభిమానిని హత్య చేసి హంతకుడిగా మారారు దర్శన్. ఇకపోతే తాజాగా జైలు జీవితం గడుపుతున్న దర్శన్ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దాదాపు 17 మంది వ్యక్తులతో పాటు హీరో దర్శన్ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. అలాగే ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ కూడా జైలు జీవితం అనుభవిస్తోంది.
అభిమానిని హత్య చేసిన దర్శన్..
నిజానికి అప్పటికే వివాహం జరిగిన దర్శన్, భార్యా, పిల్లలు ఉండి కూడా ఇలా నటి పవిత్ర గౌడతో రిలేషన్ లో ఉండడం అభిమాని జీర్ణించుకోలేకపోయారు. దీనికి తోడు పవిత్ర కూడా తమ రిలేషన్ కు 10 సంవత్సరాల అంటూ సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన అభిమాని రేణుక స్వామి. దర్శన్ వైవాహిక జీవితాన్ని నిలబెట్టడానికి పవిత్ర గౌడకు అసభ్యకరంగా మెసేజ్లు పంపించి ఇబ్బంది పెట్టాడు. దీంతో విసిగిపోయిన ఈమె దర్శన్ తో చెప్పి ఏకంగా హతమార్చింది. ముఖ్యంగా రూ.30 లక్షల సుఫారీ ఇచ్చి అభిమానిని హత్య చేయించిన వార్త సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు.
200కు పైగా ఆధారాలతో చార్జీషీట్..
ఇప్పుడు ఈ కేసులోనే వీరంతా ఇరుక్కున్నారు. అయితే తాజాగా బెంగళూరు పోలీసులు ఏకంగా 200 కు పైగా సాక్షాలను సేకరించి చార్జీషీట్ లో సమర్పించారు. నటి పవిత్ర గౌడ కు అభ్యంతరకరమైన సందేశాలు పంపిన తర్వాత దర్శన్ ఆదేశాల మేరకు ఒక ముఠా రేణుక స్వామిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసిందని లా ఎన్ ఫోర్స్ మెంట్ నిర్వహించిన దర్యాప్తులో తేలింది. ఫోరెన్సిక్ రిపోర్టులో క్రైమ్ సీన్ ఫోటోలతో సహా దాదాపు 200 కు పైగా సాక్షాలు సమర్పించారు. హత్య జరిగిన స్థలంలో దర్శన్ దుస్తులపై ఉన్న రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజ్ , పవిత్ర గౌడ పాదరక్షలు.. హత్యలో వీరి ప్రమేయం ప్రధమంగా ఉంది అని తెలియజేస్తున్నాయి.
హత్య చేసినట్టు సాక్ష్యం.. శిక్ష అనుభవించాల్సిందే..
రేణుక స్వామి పోస్టుమార్టం నివేదిక చూస్తే మాత్రం అతడి శరీరంపై అత్యంత దారుణంగా గాయాలు ఉన్నాయి . ఈ గాయాలను బట్టి చూస్తే ఆ ముఠా రేణుక స్వామిని ఎంత దారుణంగా హింసించి హతమార్చారో ఊహించుకోవచ్చు. ఇక రేణుక స్వామిని వీరంతా కలిసి హత్య చేశారు అని నిరూపించడానికి అన్ని ఆధారాలు బయటపడ్డాయి . దీన్ని బట్టి చూస్తే కచ్చితంగా రేణుక స్వామి హత్య కేసులో హీరో దర్శన్ నటి పవిత్ర గౌడ కు కచ్చితంగా శిక్ష ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.