Bigg Boss Telugu 8.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏకైక బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమం ఎట్టకేలకు సెప్టెంబర్ 1 సాయంత్రం 7:00 గంటలకు స్టార్ మా చానల్లో చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఎప్పటిలాగే ఈ సీజన్ కి కూడా నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించగా, దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈసారి సీజన్ 8 లిమిట్ లెస్ అంటూ నిర్వాహకులు ప్రేక్షకుల ముందుకు రాగా.. అందులో భాగంగానే మొదట్లోనే జంటలుగా హౌస్ లోకి పంపించి, అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ భిన్నంగా ఉంటుందని అప్పుడే నిరూపించడం మొదలుపెట్టారు.
14 మంది కంటెస్టెంట్స్ పారితోషకం..
అంతేకాదు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ లో కెప్టెన్సీ పదవి ఉండదు అని, చీఫ్ మాత్రమే ఉంటారు అంటూ సరికొత్త టాస్క్ లతో ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు హౌస్ లో ఉండే కంటెస్టెంట్లు కూడా ఎవరికివారు పర్ఫామెన్స్ చూపించేస్తున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మిగతా ఏడు సీజన్లను బాగా చూసినట్టున్నారు. అప్పుడే తెగ ఓవర్ చేసేస్తున్నారు అంటూ ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇంత పర్ఫామెన్స్ చేస్తున్నారు కదా మరి హౌస్ లో ఉండడానికి.. ఒక్కో కంటెస్టెంట్ కి వారానికి ఎంత పారితోషకం ఇస్తున్నారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి 14 మంది కంటెస్టెంట్లలో ఎవరికి ఎంత పారితోషకం ఇస్తున్నారు. వీరిలో ఎవరికి హైయెస్ట్ పారితోషకం ఇస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
హైయెస్ట్ పారితోషకం ఆమెకే..
ఇకపోతే హౌస్ లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లలో విష్ణు ప్రియ (Vishnu Priya)కి భారీ డిమాండ్ ఉంది. దాంతో పాటు క్రేజ్ కూడా ఉంది. అందుకే ఆమెకు వారానికి రూ .4లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హౌస్ లో 14 మంది కంటెస్టెంట్లలో కూడా ఈమెకే ఎక్కువ పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఇక తర్వాత హీరో ఆదిత్య ఓం (Adithya Om). ఈయనకు వారానికి రూ.3లక్షల చొప్పున పారితోషకం ఇస్తున్నారు. ఇక తర్వాత సీరియల్ నటుడు పృధ్వీరాజ్, సోనియా ఆకుల, బెజవాడ బేబక్కలకు ఒక్కొక్కరికి సుమారుగా రూ .1.50 లక్షలు వారానికి ఇస్తున్నట్లు సమాచారం.
అతి తక్కువ పారితోషకం ఆయనకే..
యశ్మీ గౌడ, ఆర్.జే. శేఖర్ భాష లకు వారానికి ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు, నిఖిల్ మలియక్కల్ రూ.2.25 లక్షలు, నైనిక రూ.2.20 లక్షలు, అభయ్ నవీన్, ప్రేరణ కంభం, కిరాక్ సీత, నబీల్ ఆఫ్రిది లకు ఒక్కొక్కరికి రూ .2లక్షల చొప్పున వారానికి పారితోషకం అందిస్తున్నారు. చిట్టచివరిగా యంగ్ నటుడు నాగ మణికంఠకు రూ .1.20లక్షలు వారానికి ఇస్తున్నట్లు సమాచారం. పదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నాగమణికంఠకు మాత్రమే హౌస్ లో అతి తక్కువ పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఒక్కొక్కరి పారితోషకం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.