Mirzapur Season 3 Review : మీర్జాపూర్ సీజన్ 3 రివ్యూ

Mirzapur Season 3 Review : ఓటిటి మూవీ లవర్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న పాపులర్ బాలీవుడ్ సిరీస్ మీర్జాపూర్ 3 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సిరీస్ కు సంబంధించిన మొదటి రెండు భాగాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో మూడవ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొనగా, జూలై 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన మీర్జాపూర్-3 సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కథ

సీజన్ 3 లో గుడ్డు పండిట్ తమ్ముడు బబ్లూ, అతని భార్య స్వీటీనీ చంపిన మున్నాపై పగ తీర్చుకోవాలని ప్రతీకారంతో రగిలిపోతాడు. టైం చూసుకుని మున్నాభాయ్ తో పాటు అతని తండ్రి కాలిన్ భయ్యా పై అటాక్ చేస్తాడు. మొత్తానికి ఈ కాల్పుల్లో మున్నాను చంపేస్తాడు గుడ్డు. అలాగే కాలిన్ భయ్యా భార్య బీనా త్రిపాఠి, గోలు హెల్ప్ తో గుడ్డు పండిట్ మీర్జాపూర్ కొత్త డాన్ గా అవతారం ఎత్తుతాడు. ఈ నేపథ్యంలోనే మరోవైపు సీఎం అయిన మున్నా భార్య మాధురి యాదవ్ అసలు ఉత్తర్ ప్రదేశ్ లోనే క్రైమ్ రేట్ లేకుండా చేయాలని నిర్ణయించుకుంటుంది. మరి ఆమె గుడ్డు పండిట్ ని ఎలా అడ్డుకుంది? గుడ్డు ఎటాక్ తర్వాత కాలిన్ భయ్యా ఏం చేశాడు? మాధురి, గుడ్డుల మధ్య జరిగిన పోరులో గెలిచిందెవరు? వంటి విషయాలు తెలియాలంటే ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మీర్జాపూర్ 3 సిరీస్ ను చూడాల్సిందే.

Mirzapur Season 3 Review: Tripathis, Shuklas & Pandits Lose The 'Bhaukaal'  But Get Saved By Queens Of Mirzapur & A Heroic Climax - Can We Get Season 4  ASAP?!

- Advertisement -

విశ్లేషణ

మీర్జాపూర్ ఫస్ట్ రెండు సిరీస్ లకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మూడవ పార్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంతేకాకుండా ఈ సిరీస్ ఇంకా కొనసాగడానికి ముఖ్య కారణం అందులో ఉన్న అడల్ట్ డైలాగులు, రక్తపాతం అని చెప్పొచ్చు. కానీ మూడో పార్ట్ ఊహించిన విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా మున్నా భయ్యా లేని లోటును ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సిరీస్ లో అక్కడక్కడ వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి. కాకపోతే డ్రామాను సాగదీసే ప్రయత్నం చేయడంతో ప్రేక్షకులకు ఈ సీజన్ అంతా బోరింగ్ అనిపిస్తుంది. అలాగే ప్రేక్షకుడికి క్యూరియాసిటీని కలగజేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. పైగా స్క్రీన్ ప్లే అంతా ప్రేక్షకులకు ముందుగానే అర్థం అయిపోతుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సీజన్లోని చివరి మూడు ఎపిసోడ్లు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

మైనస్, ప్లస్ పాయింట్స్

ఈ సిరీస్లో ఈ ఎపిసోడ్ లో డ్రామా ఎక్కువగా ఉండడం, స్టోరీ నెమ్మదిగా సాగడం మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నటీనటులు, చివరి మూడు ఎపిసోడ్లలో ఉండే హైలెట్స్ మాత్రమే. అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి, ఇషా తల్వార్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నటీనటులే కాబట్టి నటనతో అదరగొట్టారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, వీఎఫ్ఎక్స్ లాంటి టెక్నికల్ అంశాలు కూడా ఫర్వాలేదు అనిపించాయి.

చివరగా…

మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే పార్ట్-3నీ ఓసారి వీక్షించొచ్చు. కాకపోతే హింస, రక్తపాతం, అసభ్య పదజాలం అనేవి ఈ సిరీస్ లోనూ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడం కాస్త కష్టమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు