Mathu Vadalara 2 Twitter Review : టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్నకొడుకు శ్రీసింహ (Sri Simha) సినిమాల్లో హీరోగా రానిస్తున్న విషయం తెలిసిందే.. గతంలో ‘ మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని కలిగించగా.. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ మూవీ పై పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది. ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో శ్రీ సింహ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి సినిమా అదిరిపోయిందనే టాక్ వినిపిస్తుంది. జనాల స్పందన ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం పదండీ..
ఈ సినిమా మొత్తం మెగాస్టార్ చిరంజీవి మాటే వినిపిస్తుంది.. చిరుకు ‘మత్తు వదలరా’ దర్శకుడు రితేష్ రాణా డై హార్డ్ ఫ్యాన్ ఏమో అని నెటిజనులు అంటున్నారు. ఎందుకంటే… ఆ సినిమా స్టార్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చిరు రెఫరెన్సులతో ముగించారు. ఇప్పుడీ ‘మత్తు వదలరా 2’లో కూడా సేమ్ టు సేమ్ అని సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ‘ఎక్స్’లో జనాలు చెప్పే మాట..
#MathuVadalara2 is full of
Mega Star Chiranjeevi references 🌟💥 #MegastarChiranjeevi #Chiranjeevi #MathuVadalara2 pic.twitter.com/Gzj0posSdY— AMAR.CHIRU (@Amarnath_555) September 12, 2024
ఈ సినిమా మొత్తం చిరంజీవికి రిఫరెన్స్ ఇస్తున్నట్లు ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. చిరంజీవి స్క్రీన్ మీద వచ్చినప్పుడు రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రితేష్ రాణా అని పేరు వేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫోటో చూసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయ్యామని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు..
Boss cult fan #RiteshRana 😂♥️ actually Mathu vadalara part 1 lo movie start, interval and end moodu boss tho ne plan chesadu director ritesh and #MathuVadalara2 lo kuda ♥️
— Mr. Haji (@always_Mega_fan) September 12, 2024
శ్రీ సింహ యాక్టింగ్ అదరగోట్టాడు.. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎలా అయ్యిందో తెలియకుండానే గడిచిపోయిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సినిమా సూపర్ ఉందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. శ్రీ సింహ బెస్ట్ ఇచ్చాడని, మూవీ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నాడు.
Kalyan pic chusinappude FDFS fix aipoyaam..#MathuVadalara2 https://t.co/vlbCB1R0Kr
— Gopii PSPK 🦋 (@myself_gopii) September 12, 2024
ఈ సినిమా డీసెంట్ వాచ్ అని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. ఫన్ ఫిల్మ్ అని, సినిమాలో చాలా నవ్వులు ఉన్నాయని, వీకెండ్ మంచి ఆప్షన్ అని మరొక నెటిజన్ చెప్పాడు. మెగా అభిమానులకు మాత్రం ఈ సినిమా పండగ.. ఈ సినిమా చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు..
మత్తు వదలరా 2′ అని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. క్లైమాక్స్ ట్విస్ట్ బావుందని సత్య హిలేరియస్ కామెడీ చేశాడని పలువురు పేర్కొన్నారు. సినిమాకు మెయిన్ హీరో సత్య అని కొందరు చెప్పడం విశేషం..
A fun-filled entertainer with plenty of laughs! Simha gave his best, Satya rocked the show as usual, and Faria looked great on screen. While it’s on par with its prequel, it doesn’t surpass it. The star hero references were fun and added to the entertainment. Overall, a solid…
— Telugu Chitraalu (@TeluguChitraalu) September 12, 2024
ఇప్పటివరకు చూసిన ప్రతి ట్వీట్ సినిమాకు పాజిటీవ్ గానే ఇచ్చారు అంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..