Mathu Vadalara 2 Review : 2019 లో వచ్చిన ‘మత్తు వదలరా’ చాలా సైలెంట్ గా వచ్చి సక్సెస్ అందుకుంది. 5 ఏళ్ళ తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో తెలుసుకుందాం రండి…
కథ :
ఫస్ట్ పార్ట్ లో డెలివరీ బాయ్స్ గా పనిచేసిన బాబు (శ్రీ సింహ), ఏసు (సత్య) అడ్డదారిలో హీ టీమ్ (కిడ్నాప్ కేసులను డీల్ చేసే హైలీ ఎమర్జెన్సీ టీమ్) లో జాబ్‌లు పొందుతారు. అయితే అక్కడ కూడా వారికి జీతం సరిపోవట్లేదు అని వారు భావిస్తారు. దీంతో ఈ జాబ్లోనే అడ్డదిడ్డంగా సంపాదించడం మొదలుపెడతారు. ఇదే టైంలో వీరి వద్దకి ఓ పెద్ద కేసు వస్తుంది. అదేంటంటే దామిని (ఝాన్సీ) అనే ఆమె కూతురు కాడ్నాప్ అవుతుంది. కిడ్నాపర్లు ఈమెను 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తారు. అయితే ఆమెను కంప్లైంట్ ఇవ్వకుండా చేసి డబ్బులు నొక్కేద్దాం అని బాబు, ఏసు భావిస్తారు. అదే టైంలో ఫస్ట్ పార్ట్ లో మాదిరే మరో మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. తర్వాత దామిని ఓ జూనియర్ ఆర్టిస్ట్ అని వీరికి తెలుస్తుంది. వీరిని ఇలా కావాలనే మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? ఈ కథలో నిథి పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
కామెడీ సినిమాలకి కాలం చెల్లిపోయింది అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కానీ అది తప్పు అని.. ‘మ్యాడ్’, ‘ఆయ్’ వంటి సినిమాలు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. ఓటీటీల హవా పెరిగిన తర్వాత డార్క్ కామెడీ అంటే ఏంటో కూడా జనాలకి తెలిసింది. అయితే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సెటైరికల్ కామెడీ పండించడం అనేది తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది దర్శకుడు రితేష్ రానా. 2019 లో వచ్చిన ‘మత్తు వదలరా’ పై పెద్దగా అంచనాలు లేవు. ఆ సినిమాలో కామెడీ బాగా పండుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఆ సినిమా సక్సెస్ సాధించడానికి అదే మెయిన్ రీజన్ అని చెప్పాలి. కానీ ‘మత్తు వదలరా 2’ కి వచ్చేసరికి దర్శకుడు ఎక్కువ శాతం కామెడీపైనే ఆధారపడిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా సత్య కామెడీ టైమింగ్ పై గట్టిగా ఫోకస్ చేశాడు.
ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా అనిపిస్తుంది. లాజిక్స్ వంటివి ఆలోచించేలోపే బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్లు వస్తుంటాయి. అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి సీన్లు రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ కూడా కామెడీతో మ్యానేజ్ చేసే ప్రయత్నం దర్శకుడు చేసినా.. ఒకే చోట కథ రన్ అవ్వడం వల్ల కొంత డ్రాగ్ అయ్యింది. ‘మత్తు వదలరా’ రూ.2 కోట్లతో తీసిన సినిమా. కానీ సీక్వెల్ కి రూ.6 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. కొన్ని సీన్లు రిచ్ గా కనిపించాయి. అందుకు సినిమాటోగ్రాఫర్ ని మెచ్చుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కాలభైరవ బాగానే ఇచ్చాడు. ‘మత్తు వదలరా’ లో వాడిన సౌండింగ్ వాడినప్పటికీ.. సీన్ కి కరెక్ట్ గా సింక్ అవ్వడం వల్ల బాగానే అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. సింహా కోడూరి ఓకే. ‘మత్తు వదలరా’ లో చేసిన పెర్ఫార్మన్స్ మళ్ళీ చేశాడు. అంతకు మించి ఇంప్రూవ్ అయ్యింది ఏమీ లేదు. ఫరియా కూడా అంతే. ఇంకా ఆమె జాతి రత్నాలు మోడ్లోనే ఉంది. గ్లామర్ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకుంది అంటూ ఏమీ లేదు. వెన్నెల కిషోర్ బాగా నవ్వించాడు. కానీ అతని కంటే ఎక్కువగా సత్య నవ్వించాడు. ఒకప్పుడు అంటే సునీల్ కమెడియన్ గా చేస్తున్నప్పుడు మనకి ఏ రేంజ్ స్పాంటేనిటీ కనిపించేదో సత్యలో కూడా ఆ రేంజ్ స్పాంటేనిటీ కనిపించింది. చాలా ఈజ్ తో ఈ పాత్రని అతను క్యారీ చేశాడు. రోహిణి వంటి మిగతా నటీనటులు పర్వాలేదు అనిపించారు.
ప్లస్ పాయింట్స్ :
సత్య కామెడీ
ఫస్ట్ హాఫ్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లో ల్యాగ్ ఉండటం
మొత్తంగా ‘మత్తు వదలరా’ రేంజ్లో కాకపోయినా ‘మత్తు వదలరా 2’ ప్రామిసింగ్ సీక్వెల్ అనిపించుకుంటుంది. సత్య కామెడీ కోసం హ్యాపీగా థియేటర్లలో ట్రై చేయొచ్చు.