CommitteeKurrollu MovieReview : మెగా డాటర్ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ సె
కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా వేసిన పెయిడ్ ప్రీమియర్స్ కూడా మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మరి నిజంగానే సినిమా ఆ రేంజ్లో ఉందా అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకొండి
కథ :
గోదావరి జిల్లా ల్లోని చెందిన ఓ గ్రామానికి చెందిన కథ ఇది. 12 ఏళ్ళకి ఒకసారి ఆ ఊళ్లో జాతర జరుగుతుంది. ఆ జాతరను ఎప్పుడూ కమిటీ కుర్రాళ్ళు ముందుండి జరిపిస్తూ ఉంటారు. కానీ రాబోయే జాతరని జరపడానికి ఆ కమిటీ కుర్రోళ్ళు ఉండరు. మరోవైపు జాతరకు ముగిసిన పది రోజులకు పంచాయితీ ఎన్నికలు కూడా వస్తాయి. ఆ ఎన్నికల బరిలో శివ (సందీప్ సరోజ్) సర్పంచ్ పదవికి నామినేషన్ వేస్తాడు. అయితే దానికి ముందు జాతర్లో కుల వివాదం తలెత్తి.. వేరు పాటు వస్తుంది. అందువల్ల తమ స్నేహితుల మధ్య గొడవలు వచ్చి… జాతరలోనే కొట్లాటలు జరుగుతాయి. ఈ క్రమంలో తమ స్నేహితుడు కాలువలో పడి చనిపోతాడు. దీంతో స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. చివరికి వీళ్ల మధ్య దూరం తగ్గి ఒకటై జాతరని జరిపించారా? అసలు వీరి మధ్య కుల వివాదం తలెత్తడానికి కారణం ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
స్నేహితుల మధ్య సాగే కామిడీ డ్రామాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్ గా వర్కవుట్ అయితే బాక్సాఫీస్ వద్ద అవి కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంటుంది. ఆ టెక్నిక్ ని దర్శకుడు యదు వంశీ బాగా తెలుసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా ఉంటుంది. నటీనటులు గోదావరి యాసతో కూడిన డైలాగ్స్ చెప్పే విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. నవ్విస్తుంది కూడా. గోదావరి జిల్లాలకి చెందిన యువత యే రకంగా ప్రవర్తిస్తుంది. జాతరలో ఎలా అల్లరి చేస్తుంది. అమ్మాయిలతో వాళ్లు చేసే చిలిపి పనులు, అమాయకత్వం.. ఇలా అన్నీ ఆకట్టుకుంటాయి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ తో నింపాడు దర్శకుడు. అందువల్ల కొంత ఫన్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. జాతర సెట్ కి బాగానే ఖర్చు చేసింది నిర్మాత నీహారిక. విజువల్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా బాగానే ఉంది.
నటీనటుల్లో చాలా మంది కొత్త వాళ్లే ఉన్నారు. సాయి కుమార్, గోపరాజు రమణ వంటి సీనియర్లు ఉన్నారు.
ప్రతి సన్నివేశంలో తమ సీనియారిటీ చూపించారు. అయితే సాయి కుమార్ పాత్ర… శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలో ఆయన పోషించిన పాత్రకు చాలా దగ్గరగా ఉంటుంది. ప్రసాద్ బెహరా పాపులర్ యూట్యూబర్. తన కామిడీతో ఇందులో కూడా అమితముగా ఆకట్టుకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ సినిమాకి ప్లస్ అయ్యింది అనే చెప్పాలి. ఇక సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్.. అలాగే హీరోయిన్లు రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక కూడా బాగా చేశారు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
కామిడీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
క్లైమాక్స్ ల్యాగ్ ఉండటం
తెలిసిన మొకాలు ఎక్కువ లేకపోవడం
చివరిగా… సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ ను భరించగలిగితే కమిటీ కుర్రోళ్ళు ఈ వీకెండ్ కి సరదాగా థియేటర్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయతగ్గ సినిమా అని చెప్పొచ్చు.