UrmilaMatondkar : బాలీవుడ్ లో “రంగీలా” అంటూ ఇండియా మొత్తం ఊపేసిన హీరోయిన్ “ఊర్మిళా మటోండ్కర్”. పాతికేళ్ల కింద వచ్చిన ఆ సినిమా ఇండియా మొత్తం ఒక ఊపు ఊపేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అంతం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఊర్మిళ ఆయన సినిమాలతోనే పాపులర్ అయింది. తెలుగులో 90స్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగువెలిగిన ఈ భామ, ఆ తరువాత బాలీవుడ్ లో ఆర్జీవీ (Ram gopal varma) డైరెక్షన్ లోనే వచ్చిన రంగీలా (Rangeela) తో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అప్పటికే టాప్ లో ఉన్న శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి హీరోయిన్ల తరువాత ఆ రేంజ్ లో ఊర్మిళా మటోండ్కర్ ఇంపాక్ట్ చూపించింది.
50 ఏళ్ళ వయసులోకూడా యంగ్ హీరోయిన్ గా వైరల్..
ఇక ఊర్మిళా మటోండ్కర్ (UrmilaMatondkar) బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు చేయగా, 20స్ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో వెనక్కి తగ్గింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించగా, ఈ ఆమధ్య సినిమాలను పూర్తిగా దూరం పెట్టేసింది. కానీ సోషల్ మీడియాకు దగ్గరగానే ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఊర్మిళ చేసిన ఫోటోషూట్ నెట్టింట బాగా బాగా వైరల్ అవుతుంది. సిల్వర్ వైట్ డ్రెస్ లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ఫొటోలకి ఫోజిలిచ్చింది. ప్రస్తుతం ఊర్మిళ వయసు 50.. అయినా పాతికేళ్ల కుర్ర హీరోయిన్ల ఉందంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు.
రియాలిటీ షోస్ కి జడ్జ్ గా బిజీ..
ఇక ఊర్మిళా మటోండ్కర్ తెలుగులోనూ అంతం, అనుకోకుండా ఒకరోజు, గాయం (Gaayam) వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించగా, చివరగా మరాఠీలో 2014 లో అజూబా అనే సినిమాలో నటించగా, ఆ తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు హిందీ, మరాఠీ భాషల్లో పలు రియాలిటీ షోలు, డాన్స్ షో లకు జడ్జి గా వ్యవహరిస్తోంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైనా, గుర్తుండిపోయే మంచి పాత్రలు వస్తే మళ్ళీ నటిస్తానని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.