Ritu Chaudhary..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఇతరత్రా షో లలో కనిపిస్తూ ఉన్నారు. అలా విజయవాడకు చెందిన రీతూ చౌదరి కూడా మొదట సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చినా.. ఈమెకు మాత్రం జబర్దస్త్ వల్లే క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నది. దాదాపుగా ఈమెకు వన్ మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్నారు.
సీరియల్సే కాదు సినిమాల్లో కూడా అవకాశం..
మొదటిసారిగా 2006లో అంతరాత్మ అనే సీరియల్ ద్వారా కెరియర్ ప్రారంభించిన రీతూ చౌదరి, ఆ వెంటనే సూర్యవంశం, గోరింటాకు, మిస్టర్ పెళ్ళికొడుకు ఇతరత్రా సీరియల్స్ లో నటించి మరింత గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాదు రీతు చౌదరి కొన్ని సినిమాలలో కూడా నటించిందట. కేరింత, సరైనోడు వంటి చిత్రాలలో కూడా నటించిందట. కానీ యాంకర్ ప్రదీప్ చేసినటువంటి పెళ్లిచూపులు షో తో ఒకసారిగా ఫేమ్ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి గెస్ట్ గా వచ్చి అక్కడే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
బోల్డ్ డాన్స్ తో రెచ్చిపోయిన రీతూ చౌదరి..
నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ వేసే దుస్తులు, చూపించే అందాల షో గురించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా రీతూ చౌదరి ఆరెంజ్ కలర్ బికినీ లో వైట్ లెహంగాలో తన అందాలను చూపిస్తూ డాన్స్ వేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో రీతూ చౌదరి అందాన్ని చూసి కుర్రకారు తట్టుకోవడం కష్టమని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా తన బ్యాక్ అందాలని చూపిస్తూ మరింత రెచ్చగొట్టేలా కనిపిస్తోంది రీతూ చౌదరి. చాలా స్టైలిష్ గా ఇందులో వీడియోకి డాన్స్ వేసినట్టుగా కనిపిస్తోంది.
గతంలో ఎంగేజ్మెంట్.. బ్రేకప్ కూడా
గతంలో రీతూ చౌదరి ఎంగేజ్మెంట్ అయినట్టు కూడా ఫోటోలు షేర్ చేశారు. శ్రీకాంత్ అనే అబ్బాయిని పరిచయం చేస్తూ త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నామని తెలియజేసింది.. అయితే ఆ తర్వాత ఈ విషయం గురించి ఎక్కడ స్పందించలేదు దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని వార్తలు వినిపించాయి. ఇప్పటికీ ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు రీతూ చౌదరి. ఈ విషయంపై ఆమె స్పందించలేదు కానీ ఇప్పుడు నిత్యం రకరకాల గ్లామర్ ఫోటోషూట్ తో నిత్యం ఆకట్టుకుంటుంది.
ఆ విషయంలో విమర్శలు..
ఇదిలా ఉండగా గతంలో ఈమె తన తండ్రి చనిపోయినట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే తండ్రి మరణించిన కొద్ది రోజులకి గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో కనిపించడంతో అభిమానుల సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్నేహితురాలు ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ తో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి బోల్డ్ ఫోటోషూట్లతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వీరిని చూస్తే తెలుగమ్మాయిలేనా అనే అనుమానం కూడా కలగక మానదు. మొత్తానికి అయితే రీతూ చౌదరి కి సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram