ParvathyThiruvothu : చియాన్ విక్రమ్ హీరోగా నటించిన “తంగలాన్” సినిమా ఈ పంద్రాగస్టుకి విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించినంతగా ఆడడం లేదు. అయినా డీసెంట్ కలెక్షన్లను సాధిస్తూ, లిమిటెడ్ స్క్రీన్స్ లో రన్ అవుతుంది. ఇక పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ హారర్ డ్రామా లో విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా నటించగా, హీరోయిన్ గా నెగిటివ్ షేడ్స్ లో మాళవిక మోహనన్ నటించింది. అయితే విక్రమ్ కి జోడీగా పార్వతి తిరువోతు (ParvathyThiruvothu) అనే మలయాళ హీరోయిన్ నటించడం జరిగింది. ఇక తంగలాన్ లో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ తనవంతు పాత్రని చక్కగా పోషించి విమర్శకుల ప్రశంసలందుకుంది.
డీ గ్లామర్ హీరోయిన్ ఘాటు ఫోటోషూట్స్..
ఇక అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీకి ఏమాత్రం పరిచయం లేని ఈ అమ్మాయిని తంగలాన్ (Thangalaan) లో చూసి నెటిజన్లు ఈ హీరోయిన్ నిజంగానే డీ గ్లామర్ గా ఉంటుందని అనుకున్నారు. కానీ అది సినిమా వరకే అని తర్వాత తెలిసింది. నిజానికి తంగలాన్ హీరోయిన్ పార్వతి తిరువోతు మలయాళం లో మంచి గ్లామర్ రోల్స్ చేసింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మాయికి మంచి ఫాలోవర్లు ఉండడం విశేషం. తాజాగా చేసిన ఫోటో షూట్ నెట్టింట మంచి ట్రెండ్ అవుతున్నాయి. మరీ బోల్డ్ గ్లామర్ షో కాకున్నా, మంచి ఘాటైన చూపులతో అందాలు ప్రదర్శిస్తుంది. తాజాగా గోల్డెన్ సిల్వర్ కలర్ మిక్సింగ్ డ్రెస్ లో పదునైన చూపులతో యూత్ ని ఆకర్శిస్తూ ఫోజిచ్చింది.
తెలుగు దూత వెబ్ సిరీస్ తో పాపులర్..
ఇక మలయాళంలో బెంగుళూరు డేస్’, ‘చార్లీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి పార్వతి తిరువోతు, తెలుగులో సినిమాల్లో నటించకపోయినా, ఓ సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించింది. తెలుగు ప్రేక్షకులు సినిమాలపై ఎక్కువ ఆదరణ చూపిస్తారు కాబట్టి, ఈ హీరోయిన్ ని గమనించి ఉండరు. లాస్ట్ ఇయర్ నాగ చైతన్య నటించిన ‘ధూత’ (Dootha) అనే వెబ్ సిరీస్ లో పార్వతి తిరువొతు నటించింది. ఇక తంగలాన్ లో గిరిజన అటవీ ప్రాంత మహిళగా డీసెంట్ నటనతో ఆకట్టుకున్న పార్వతి తిరువొతు ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.