NabhaNatesh : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ & గ్లామరస్ హీరోయిన్లలో ‘నభా నటేష్’ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ తో పాపులర్ అయిన ఈ భామ ఇస్మార్ట్ బ్యూటీ టాలీవుడ్ లో పాపులర్ అయింది. అంతకంటే ముందే అదుగో, నన్ను దోచుకుందువటే సినిమాలతో ఆడియన్స్ ని పలకరించినా, ఇస్మార్ట్ శంకర్ తోనే ఫేమ్ వచ్చింది. ఇక ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి చిత్రాల్లో నటించిన నభా ఆ తర్వాత సినిమాలకు కొన్నాళ్ళు దూరమయింది. ఇక దాదాపు మూడేళ్ల తర్వాత రీసెంట్ గా డార్లింగ్ (Darling) సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అవగా సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా నభా డీలా పడకుండా ఇతర ప్రాజెక్ట్స్ లతో బిజీగా ఉంది.
అచ్చ తెలుగమ్మాయిలా మారిపోయిన నభా!
ఇదిలా ఉండగా నభా నటేష్ (NabhaNatesh) సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ తో, ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. ఘాటు అందాలతో గ్లామర్ షో చేస్తూ నెట్టింట క్రేజ్ సంపాదించుకుంది. ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా నభా నటేష్ చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతుంది. వినాయక చవితి స్పెషల్ గా అచ్చ తెలుగమ్మాయిలా, సంప్రదాయమైన లంగా వోణి దుస్తులు ధరించి, గుడి దగ్గర చేసిన ఫోటోషూట్ తో బాగా ఆకట్టుకుంటుంది. ఈ పిక్స్ చూస్తే ఏ దర్శక నిర్మాత అయినా నభా కి మళ్ళీ ఛాన్సులు ఇచ్చేయొచ్చు. ఆ పిక్స్ లో అంతందంగా మైమరపిస్తుంది నభా.
వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ…
ఇక నభా నటేష్ తెలుగమ్మాయి కాకపోయినా కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ, హైదరాబాద్ లోనే ఉంటుంది. పైగా తెలుగు కూడా ఇప్పుడు బాగానే నేర్చుకుందని రీసెంట్ గా డార్లింగ్ ప్రమోషన్లలో తెలిసింది. ఇక ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న చారిత్రక నేపథ్యం తో తెరకెక్కుతున్న ‘స్వయంభు’ (Swayambhu) అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆ సినిమాలో ఓ రాజ కుమారి గా నభా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు మరో తమిళ్ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.