Jyothi Poorvaj.. ఈ మధ్యకాలంలో చాలామంది నటీమణులు సీరియల్స్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఆ తర్వాత సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కూడా ఒకరు. గత కొన్ని నెలలుగా వైవాహిక జీవితంలో విమర్శలు ఎదుర్కొని, వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె.. ఇటీవలే సీరియల్ డైరెక్టర్ సుకు పూర్వాజ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలోనే సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న జ్యోతి..
టెలివిజన్ ప్రపంచంలో జగతి పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న జ్యోతి, ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో సంచలనం సృష్టిస్తోంది. కొత్త పేరు, కొత్త లుక్కుతో ఆమె మరింత ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. తాజాగా మినీ డ్రెస్ లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.. టాటూ అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె ఫోటోలు చూసి అభిమానుల సైతం పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఈమె కొత్త లుక్ కి నెటిజెన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
జ్యోతి సినిమాలు..
జ్యోతి గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె, ఆ తర్వాత తన అందచందాలతో సోషల్ మీడియాలో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈమె భర్త సుకు పూర్వాజ్ తో కలిసి ప్రముఖ చిత్ర దర్శకుడు రూపొందిస్తున్న ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది జ్యోతి. ఇకపోతే ఈ సినిమా ఒకవేళ మంచి విజయం సాధిస్తే ఈమె కెరీర్ కు కొత్త ఒరవడి తీసుకురావచ్చు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సినిమాలు అంటూ బిజీగా దూసుకుపోతున్న ఈమె గ్లామర్ తో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కు గుడ్ బాయ్ చెప్పేసిన జ్యోతి పూర్వాజ్ భవిష్యత్తులో హీరోయిన్ గా స్థిరపడాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో అందాలను వలకబోస్తూ వారి అందాలతో పోటీ పడుతున్న ఈమె హీరోయిన్ గా సెటిల్ అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
జ్యోతి పూర్వాజ్ కెరియర్
జ్యోతి పూర్వాజ్ కెరియర్ విషయానికి వస్తే.. సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ అక్కడే పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత తెలుగు బుల్లితెర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇక ఇక్కడ తల్లి క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె ఒక్కసారిగా ఇప్పుడు గ్లామర్ వొలకబోస్తూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇంత అందంగా ఉండే అమ్మాయి తల్లిగా ఎలా నటించింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే జ్యోతి త్వరలో హీరోయిన్గా సెటిల్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
View this post on Instagram