DeviyaniSharma : టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా, ఎక్కువ మంది గ్లామర్ రోల్స్ లోనే పాపులర్ అవుతూ ఉంటారు. పెర్ఫార్మన్స్ రోల్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే, మరి కొందరు గ్లామర్ షో తో నెట్టుకొస్తారు. ఇంకొందరు మాత్రం రెండూ కలగలిపి సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి హీరోయిన్లలో దేవియని శర్మ మూడో కోవలోకి వస్తుంది. భానుమతి రామకృష్ణ అనే చిన్న సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన ఈ భామ, రొమాంటిక్, అనగనగా వంటి పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ రెండు వెబ్ సిరీస్ లతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చింది.
వెబ్ సిరీస్ లతో సూపర్ క్రేజ్..
ఢిల్లీకి చెందిన దేవియని శర్మ (DeviyaniSharma) కు తెలుగులో అంతగా సినిమాల ద్వారా గుర్తింపు రాలేదు కానీ, వెబ్ సిరీస్ లతో మాత్రం సూపర్ గా పాపులర్ అయింది. ముందుగా ఘాన్సీ అనే సిరీస్ లో కీలక పాత్రలో నటించగా, ఆ తర్వాత సైతాన్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సీరిస్ లో వైవిధ్యం వైవిధ్యం ఉన్న పాత్రలో అద్భుతంగా నటించగా, పలు బోల్డ్ సీన్లతో సూపర్ గా క్రేజ్ సంపాదించింది. అలాగే ఆ వెంటనే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కూడా ఒక హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. కాగా లేటెస్ట్ గా చేసిన ఫోటోషూట్ బాగా వైరల్ అవుతుంది.
చీరలో మత్తెక్కిస్తోంది..
ఇక దేవియాని శర్మ లేటెస్ట్ గా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చీరలో ఈ అమ్మాయి కనిపించగా, గ్రీనరీ ఉన్న చీరలో, వైట్ జాకెట్ లో తెలుగమ్మాయిలానే ఉండి ఆకట్టుకుంటుంది. అయితే వెబ్ సిరీస్ లలో ఛాన్సులు బాగా వస్తున్నాయి, కానీ సినిమాల్లో హీరోయిన్ గా ఎక్కువగా అవకాశాలు రావట్లేదని టాక్. ఏది ఏమైనా సినిమాలతో పెద్దగా రాని గుర్తింపు సోషల్ మీడియాలో తన ఫోటోషూట్లతో సంపాదించుకుంటుందని చెప్పాలి.