Deepika Padukone : బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే ( Deepika Padukone ) పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కల్కి ( Kalki ) సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో మంచి క్రేజ్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలు చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. అయితే తాజాగా ఆమె ప్రగ్నెన్సీ ఫోటో షూట్ చేసింది. అయితే నిండు గర్భిణీగా ఉన్న ఆమె ఇలా ఫోటోలను దిగడం పై ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇక నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీపికా పదుకొనే తన భర్తతో కలిసి దిగిన ఆ ఫోటోలు కాస్త బోల్డ్ గా ఉన్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరోసారి కనిపించింది. గర్భంతో ఉన్న ఈమె బోల్డ్ లుక్ వచ్చేలా డ్రెస్సులను వేసుకోవడం అందరిని అశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ ఫోటోలలో ఆమె లుక్ ఏమో గానీ డ్రెస్ మాత్రం అందరికీ కోపాన్ని తెప్పించింది. చాలా పలుచగా ఉండటం మాత్రమే కాదు అవి కొత్తగా అనిపించాయి. చాలా తేల్లిగా గాల్లోకి ఎగిరే దుస్తులు. నలుపు రంగులో ఉన్న ఈ అవుట్ ఫిట్స్ మంచి ట్రెండీ లుక్ తీసుకొచ్చాయి. వీటిలో ఒక లుక్ కోసం ఆమె ఫ్లేర్డ్ డెనిమ్ జీన్స్ కు జతగా నిట్టెడ్ స్వెటర్ ధరించారు. ఈ లుక్ సౌకర్యంతో పాటూ ఫ్యాషన్ వైబ్స్ తెచ్చిపెట్టింది. ఇక మరో లుక్ కోసం మరో డ్రెస్సును వేసుకుంది.
షిమ్మర్ ఓపెన్ బ్లేజర్ వేసుకుంది దీపిక. దానికి జతగా లూజ్ ప్యాంట్ వేసుకుంది. ఇక లుక్ అందం రెట్టింపు చేయడానికి తేలికైన, పలుచని వస్త్రాలను సెలెక్ట్ చేసుకుంది. హై నెక్ లైన్, బెలూన్ స్లీవ్స్ కలిగి ఉన్నాయి. ఫ్లోయింగ్ బాటమ్తో అదనపు అందం తోడైతంది. మరో స్టైలిష్ డ్రెస్ కోసం బాడీకాన్ ఫిట్ డ్రెస్ ఎంచుకుంది దీపిక. దీంట్లో దీపిక బేబీ బంప్ హత్తుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సహజ మేకప్ లుక్ వచ్చేలా లూజ్ వేవీ హెయిర్ స్టైల్ లో దీపిక అందంగా కనిపించారు. దీపిక ఎలాంటి లుక్ అయినా అదరగొడుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.. మరికొందరు మాత్రం ఈమె ఎలాంటి పరిస్థితులలో ఉంది. ఇప్పుడు ఇలాంటి బోల్డ్ ఫోటో షూట్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి..
View this post on Instagram