Stree 2 OTT: మంచి కథతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ప్రేక్షకుల పెద్దగా ఆదరించలేదు.. కానీ హారర్, థ్రిల్లర్ మూవీస్ ను ఎక్కువగా చూస్తున్నారు. కథతో పెద్ద పనిలేకుండా వణికించే సన్నివేశాలు ఉన్న సినిమాలకు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను చాలాసార్లు హారర్ కామెడీ చిత్రాలే కాపాడాయి. ఇటీవల అలాంటి సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ స్త్రీ 2 ( Stree 2)… శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor), రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) జంటగా నటించారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల విడుదలయిన ఒక హారర్ కామెడీ కూడా ఇతర సినిమాల రికార్డులను బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్లింది. అంతే కాకుండా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆ మూవీనే ‘స్త్రీ 2’. ఆగస్ట్ 15న ఎన్నో సినిమాలతో పోటీపడుతూ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ మొదటి రోజే పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం తో పాటుగా బాక్సాఫీస్ ను కొల్లగొట్టే కలెక్షన్స్ ను అందుకుంది. సినిమా వచ్చి నెల కావొస్తున్నా కూడా కలెక్షన్స్ తగ్గలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజులో రెస్పాన్స్ వస్తుందో అని.. ఓటీటీ పార్ట్నర్ ను భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. ఆ డిటైల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
తాజాగా స్త్రీ2 ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటికొచ్చింది. బాలీవుడ్ లో ఒక మూవీ హిట్ టాక్ అందుకుందంటే కచ్చితంగా రెండు లేదా మూడు నెలల వరకు దానిని ఓటీటీ స్ట్రీమ్ చేయడానికి మేకర్స్ ఒప్పుకోవడం లేదు. కానీ ‘స్త్రీ 2’ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. సెప్టెంబర్‌లోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవుతుందని ఓ వార్త ఇండస్ట్రీ లో షికారు చేస్తుంది. బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్మెంట్ రానున్నట్లు సమాచారం.ఈ మూవీని ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.. 2018లో విడుదలైన బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ స్త్రీకి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. ‘స్త్రీ 2’ బాక్సాఫీస్ కలెక్షన్‌ను రూ. 516.25 కోట్లు దాటేసింది. ఇదే సినిమాకు ప్లస్ అయ్యింది. శ్రద్దా కపూర్ కు కం బ్యాక్ మూవీగా నిలిచింది. అత్యధిక వసూల్ తో ఇప్పటికి దూసుకుపోతుంది. థియేటర్ల లో హిట్ టాక్ ను అందుకున్న మూవీ.. ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..